TVK MLA Birthday : అటో డ్రైవర్ అంటూ గెలిచి.. 2 రోజుల్లోనే బుద్ధి చూపెట్టిన TVK ఎమ్మెల్యే.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు!

రాయపురం నియోజకవర్గం నుండి కొత్తగా ఎన్నికైన TVK (తమిళ వెట్రి కజగం) ఎమ్మెల్యే కె.వి. విజయ్ దాము పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పుట్టినరోజు వేడుకల్లో ఒక అభిమాని ఇచ్చిన భారీ కత్తితో ఆయన కనిపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

New Update
FotoJet - 2026-05-06T121948.625

New TVK MLA Cuts Birthday Cake with Sword at Chennai Event

TVK MLA Birthday : రాయపురం నియోజకవర్గం నుండి కొత్తగా ఎన్నికైన TVK (తమిళ వెట్రి కజగం) ఎమ్మెల్యే కె.వి. విజయ్ దాము పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాల్‌లో జరిగిన తన 46వ పుట్టినరోజు వేడుకల్లో విజయ్ దాము ఒక భారీ కత్తితో కేక్ కట్ చేయడం వివాదానికి దారితీసింది. ఆ కత్తి ప్లాస్టిక్ ,చెక్కతో చేసినదని అనుచరులు చెబుతున్నప్పటికీ, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  మాజీ ఆటో రిక్షా డ్రైవర్ అయిన విజయ్ దాము, ఇటీవలి ఎన్నికలలో అద్భుత విజయాన్ని అందుకున్నారు. బలమైన ప్రత్యర్థులైన DMK, AIADMK అభ్యర్థులను ఓడించి ఆయన రాయపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుట్టినరోజు వేడుకల్లో ఒక అభిమాని ఇచ్చిన భారీ కత్తితో ఆయన కనిపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది "గూండాయిజం" (Thuggery) లా ఉందని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, విజయ్ దాము గతంలో తను హింసకు వ్యతిరేకమని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ఇలా కత్తితో కేక్ కట్ చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు పోలీసులు సైతం ఇలా ఆయధాలతో కేట్ కట్ చేయడం, వేడుకల్లో కత్తులు ప్రదర్శించడం చేస్తే కేసు నమోదు చేసే అవకాశం ఉందని పేర్కోనడం గమనార్హం.

ఎన్నికల్లో భారీ విజయాలతో దూసుకుపోతున్న వేళ, పార్టీకి ఉన్న "క్లీన్ ఇమేజ్"కు ఈ ఘటన మచ్చ తెచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై TVK పార్టీ నాయకత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. "ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి పనులు చేయడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుంది." -అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  కొందరు దీనిని కేవలం ఒక సరదా వేడుకగా కొట్టిపారేస్తుండగా, మరికొందరు మాత్రం బహిరంగంగా ఆయుధాలను (అవి నకిలీవైనా సరే) ప్రదర్శించడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తున్నారు. పార్టీ ఎదుగుతున్న తొలి దశలోనే ఇలాంటి వివాదాలు రావడం TVK కి ఒక సవాలుగా మారింది.

Advertisment
తాజా కథనాలు