/rtv/media/media_files/2026/05/01/petrol-diesel-prices-likely-to-hike-after-polls-2026-05-01-21-36-26.jpg)
petrol, diesel prices likely to hike after polls
న్యూఢిల్లీలో సరికొత్త 'E85' ఇంధనాన్ని అధికారికంగా విడుదల చేశారు. ఈ సరికొత్త ఇంధనం ధర లీటరు కేవలం రూ. 82 లు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ E20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది ఏకంగా రూ.20లు తక్కువ. ఈ చౌక ఇంధనం అందుబాటులోకి రావడం వల్ల సాధారణ వాహనదారులకు, ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులకు జేబు భారం చాలా వరకు తగ్గనుంది.
At ₹82.12 per litre, E85 fuel is priced ₹20 lower than E20 fuel, in Delhi, where the first E85 dispenser was inaugurated at an Indian Oil fuel station.
— carandbike (@carandbike) June 5, 2026
Is it a fair price? pic.twitter.com/XjECFqniLG
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
అసలు ఏంటి ఈ E85 ఇంధనం
ఈ ఇంధనంలో 85 శాతం ఇథనాల్,15 శాతం సాధారణ పెట్రోల్ కలయికతో రూపొందించిన ప్రత్యేకమైన బయో-ఫ్యూయల్. చెరకు పిప్పి, పాడైపోయిన ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఈ ఇథనాల్‌ను తయారు చేస్తారు. మన దేశంలోనే సొంతంగా ఈ ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్లే ప్రభుత్వం ఇంత తక్కువ ధరకే ఇంధనాన్ని అందించగలుగుతోంది. దీనివల్ల విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ముడి చమురు భారం దేశంపై గణనీయంగా తగ్గుతుంది.
ఈ E85 ఇంధనాన్ని అన్ని రకాల సాధారణ వాహనాలలో నేరుగా వాడటానికి వీల్లేదు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఫ్లెక్స్-ఫ్యూయల్' ఇంజన్లు కలిగిన కార్లు, బైకులలో మాత్రమే ఈ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ E85 ఇంధనం వల్ల కేవలం డబ్బు ఆదా అవ్వడమే కాకుండా.. పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీనివల్ల వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని చాలా వరకు తగ్గుతుంది.
Follow Us