హిస్టారికల్ చేంజ్.. మమత జైత్రయాత్ర మొదలైన చోటే .. BJP తొలి సీఎం ప్రమాణ స్వీకారం!

పశ్చిమ బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. TMC అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి పునాది పడిన కోల్‌కతాలోని ఐకానిక్  బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా.. తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార జరగనుంది

New Update
bjp

పశ్చిమ బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి పునాది పడిన కోల్‌కతాలోని ఐకానిక్  బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా.. మే 9న బెంగాల్‌ నేలపై తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది.

ఎక్కడైతే దీదీ తన రాజకీయ బలాన్ని చాటుకుందో.. సరిగ్గా అదే మైదానంలో ప్రమాణ స్వీకార వేడుకను నిర్వహించడం ద్వారా బెంగాల్ ప్రజల్లోకి మహా అధికార మార్పిడి అనే బలమైన సందేశాన్ని పంపాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

వందల ఏళ్ల ఘన చరిత్ర

విక్టోరియా మెమోరియల్, షహీద్ మీనార్ మధ్య విస్తరించి ఉన్న ఈ మైదానానికి వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ మైదానాన్ని బ్రిటీష్ సైన్యం పరేడ్ కోసమే కాకుండా తమ సైనిక వ్యూహాల కోసం ఉపయోగించేది. ఇది పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద స్వరంగా మారింది. దాదాపు 5 నుండి 6 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఏకకాలంలో సభలు నిర్వహించవచ్చు. కేవలం బెంగాల్ నేతలే కాదు.. సోవియట్ లీడర్ క్రుష్చెవ్, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇక్కడే భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు.

అప్పట్లో యువ కాంగ్రెస్ నేతగా, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ.. కాంగ్రెస్ సొంత విధానాలకు వ్యతిరేకంగా ఇదే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో చారిత్రాత్మక రాలీ నిర్వహించి బహిరంగంగా రాజీనామా ప్రకటించారు. ఇది బెంగాల్ రాజకీయాల్లో మమత తిరుగులేని శక్తిగా ఎదగడానికి నాంది పలికింది. కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ (TMC) స్థాపించిన తర్వాత ఇదే మైదానం ఆమెకు వేదికైంది. చివరకు 2011లో బెంగాల్‌లో 34 ఏళ్ల సుదీర్ఘ వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారం దక్కించుకున్నాక.. తన విజయకేతనాన్ని మమతా బెనర్జీ ఇక్కడే ఘనంగా ప్రదర్శించారు.

నాడు మమతకు వేదికైన అదే చారిత్రక మైదానంలో ఇప్పుడు కమలం వికసించబోతోంది. మే 9న జరగనున్న బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. అయితే సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది చూడాలి. అయితే ఎక్కువగా మాత్రం సువేందు అధికారి పేరు బలంగా వినిపిస్తుంది. 

కాగా ఇటీవల వెలుడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధికంగా 207 స్థానాలను గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లు, కాంగ్రెస్ 2,  ఆమ్ జనతా డెవలప్‌మెంట్ పార్టీ 2  ఇతరులు రెండో చోట్ల గెలిచారు. 

Advertisment
తాజా కథనాలు