PM Modi: మోదీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు.. ముంబై పోలీసులు అలెర్ట్!

ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.

New Update
modi

modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో  ఉన్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు(Threat Call) రావడం తీవ్ర కలకలం రేపింది.  అమెరికా పర్యటన(America Visit)కు రెండు రోజుల ముందు ముంబై పోలీసులకు ప్రధాని మోడీ విమానంపై ఉగ్రవాద దాడి(Terrorist Attack) జరుగుతుందని బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోడీ విమానంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని బెదిరింపు కాల్ వచ్చిందని ముంబై పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.  సమాచారంలో ఉన్న తీవ్రత దృష్ట్యా వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని..   కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని ముంబయి పోలీసులు వెల్లడించారు.  దర్యాప్తులో భాగంగా ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని  వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు.  

Also Read: Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికాలకు నాలుగు రోజుల పర్యటనకు వెళ్లారు.  పారిస్ తర్వాత ఆయన ఈరోజు వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన  భేటీ కానున్నారు. అంతకుముందు, ప్రధాని మోదీ మంగళవారం ఫ్రాన్స్ చేరుకున్నారు, అక్కడ ఆయనకు భారతీయలు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశమయ్యారు, పారిస్‌లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్, 14వ ఇండియా-ఫ్రాన్స్ CEO ఫోరమ్‌కు అధ్యక్షత వహించారు.  

వికసిత్ భారత్ లక్ష్యంగా

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్(Emmanuel Macron) తో కలిసి ఏఐ సమ్మిట్(AI Summit) కు అధ్యక్షత వహించడం ఆనందంగా ఉందని  అన్నారు ప్రధాని మోదీ. గత రెండేళ్ళల్లో  తామిద్దరం కలవడం ఇది ఆరోసారని చెప్పారు. భారత్ లో గత పదేళ్ళల్లో చాలా మార్పులు జరిగాయి. భారత్ అన్ని రకాలుగా , స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. మేక్‌ ఇన్ ఇండియా, మేక్‌ ఫర్‌ ది వరల్డ్‌’’ని ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. అందుకే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచించారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన చెప్పారు. 

Also Read :  హనుమాన్ ఆలయంలో అపచారం.. శివలింగం పక్కన మాంసం ముద్దలు.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment