కళ్ల ముందే కదులుతున్న కారు దగ్ధం.. డ్రైవర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

జైపూర్‌లో కదులుతున్న కారు దగ్ధం కావడంతో భయానక దృశ్యం కనిపించింది. ఈ సంఘటన శ్యామ్‌నగర్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, డ్రైవర్ కదులుతున్న కారు నుండి బయటకు దూకేశాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
moving car catches fire in Jaipur

రాజధాని జైపూర్‌లో కదులుతున్న కారు దగ్ధం కావడంతో భయానక దృశ్యం కనిపించింది. ఈ సంఘటన శ్యామ్ నగర్ ఫ్రూట్ మార్కెట్ సమీపంలో జరిగింది. ఈ పరిణామంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. మరికొందరు తమ వాహనాలను అక్కడికక్కడే వదిలేసి పరుగులు తీశారు.

కారులో మంటలు

కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. అందులో ఉన్న డ్రైవర్ కదులుతున్న కారు నుండి దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పేసరికే వాహనం పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. అయితే మంటల్లో కాలిపోయిన ఆ కారు జితేంద్ర అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. ఏమైందంటే?

కాగా కారు ఏసీలో నుంచి పొగలు రావడం ముందుగా గమనించిన డ్రైవర.. ఆ తర్వాత బానెట్ తెరిచి చూస్తున్న క్రమంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా వాహనం మొత్తం వ్యాపించాయని చెప్పాడు. దీంతో వెంటనే హ్యాండ్ బ్రేక్ కూడా దెబ్బతినడంతో కారు అదుపు తప్పి వంతెన నుంచి కిందకు వేగంగా దూసుకెళ్లినట్టు తెలిపాడు. రోడ్డుపై పలు వాహనాలను కారు ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది.

Also Read :  కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment