హనుమంతుడే పంపాడేమో.. కామాంధుడి నుంచి బాలికను కాపాడిన కోతులు!

యూపీలోని బాగ్‌పత్‌లో ఓ యువకుడు 6 ఏళ్ల బాలికను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఇంతలో ఆ ఆంజనేయుడే పంపాడన్నట్టుగా అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చి అతనిపై దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.  

New Update
monkey

National : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో వింత ఘటన వెలుగు చూసింది. అంతేకాకుండా అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఆరేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఓ యువకుడు తనతో పాటు తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుండగా ఒక్కసారిగా ఆ దేవుడే పంపినట్టు అక్కడికి ఓ కోతుల గుంపు వచ్చింది. ఒక్కసారిగా యువకుడిపై దాడి చేశాయి. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా బాలికను ఆ వానరాలు కాపాడాయి.

నిందితుడిపై పోక్సో కేసు:

ఆ తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి యువకుడిపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ బయటికి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

సీసీటీవీలో బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు:

సింఘావలీ అహిర్‌లోని డోలా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీసీటీవీలో బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. పోలీసులు నిందితుడిని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తండ్రి మాట్లాడుతూ సమయానికి వానరాలు అక్కడికి రాకపోతే చిన్నారి ఏమయ్యేదో అంటూ బోరున విలపించాడు. ఆ ఆంజనేయుడే వాటిని అక్కడికి పంపాడని కృతజ్ఞతలు తెలిపాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికులు సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా భగవంతుడి లీలే అంటూ మాట్లాడుకుంటున్నారు.

Also Read :  నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist letter: భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

సేవ్ కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ లీడర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట లేఖ విడుదలైంది.

New Update

సెంట్రల్ బలగాలు, ఛతీస్‌గఢ్ పోలీసులు సేవ్ కర్రెగుట్టలు జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. మూడు రోజులుగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఆ నక్సల్ యాంటీ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ పార్టీ నాయకుడు లేఖ రాశాడు. ఆపరేషన్ నిలిపి.. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదలైంది.

చర్చల కోసం ముందుకు రావాలంటూ లేఖ సారాంశం. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ లేఖలో డిమాండ్
చేశారు. శాంతి చర్చలకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని రూపేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని ఆయన అంటున్నారు. హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్‌ను నెల రోజులు వాయిదా వేయాలన్నారు. 

Also read: Minister Uttam Kumar: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి

చతీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టల అనే అటవి ప్రాంతం ఉంది. మావోయిస్టుల అగ్రనేతలు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దులు జరుగుతున్న సైనిక ఆపరేషన్ వెంటనే ఆపాలని రూపేష్ లేఖలో పేర్కొన్నారు.

Also read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

(letter | maoist-letter | Maoist Letter on Encounter | chattisgarh border | chattisaghad | latest-telugu-news | telangana | Anti-Maoist Operation | Maoists In Mulugu Karre Gutta | Maoists Mulugu Karre Gutta)

Advertisment
Advertisment
Advertisment