/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-12-47-31.jpg)
Modi's target finish..check for those four regional parties
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ, ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అటు పశ్చిమబెంగాల్, ఇటు దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలను టార్గెట్ చేసిన మోదీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిని దెబ్బతీయడంలో విజయం సాధించాడనే చెప్పవచ్చు.
తెలంగాణలో కేసీఆర్ (BRS), తమిళనాడులో స్టాలిన్ (DMK), పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ (TMC), ఢిల్లీలో కెజ్రీవాల్ (ఆమ్‌ఆద్మీ) తమ రాష్ట్రాల్లో తిరుగులేని శక్తులుగా ఎదిగారు. వీరిని రాజకీయంగా ఎదుర్కోవడం ద్వారా దక్షిణాది,తూర్పు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ భావించింది. ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ నాయకులను టార్గెట్ చేసుకుంది.
1. తెలంగాణలో కేసీఆర్ (BRS): తెలంగాణ ఉద్యమం ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా ఉద్యమ నేతగా ఎదిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పలు అంశాల్లో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీతో విభేదించారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక వాదాన్ని బలపరుస్తూ వచ్చారు. పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగేందుకు టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్ గా మార్చడమే కాకుండా దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇది కేంద్రానికి, ముఖ్యంగా మోదీకి మింగుడుపడని అంశంగా మారింది. దీంతో 'టార్గెట్ కేసీఆర్' అనే వ్యూహాన్ని అమలు చేసింది. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన మోదీ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే కేసీఆరే ప్రమాదకారి భావించి బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. కేసీఆర్ కూతురు కవితను లిక్కర్ స్కాం లో ఇరికించడం ద్వారా ఆయన ఇమెజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఫలితంగా తెలంగాణలో అధికార మార్పిడి సాధ్యమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. అటు బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలోనూ ప్రాతినిథ్యం లేకుండా చేయడం ద్వారా మోదీ విజయం సాధించారనే చెప్పవచ్చు.మోదీ నేతృత్వంలోని బీజేపీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికార వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా ఉంది.
2. కేజ్రీవాల్ (అమ్‌ఆద్మీ పార్టీ) ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన అమ్‌ఆద్మీ పార్టీని అధినేత కేజ్రీవాల్ సైతం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాడు. ప్రతి విషయంలోనూ మోడీ విధానాలను ఆయన తూర్పారపడుతూ వచ్చారు. దీంతో ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు మద్యంస్కాం వంటి అంశాలను తెరపైకి తేవడం ద్వారా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ దిశలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం ద్వారా విజయం సాధించారు. మరోవైపు ఇటీవల ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలను కూడా బీజేపీలో చేర్చుకుని కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు.
3. తమిళనాడులో స్టాలిన్ (DMK): ద్రవిడ రాజకీయాలు బలంగా ఉన్న తమిళనాడులో స్టాలిన్‌ను ఢీకొట్టడం బీజేపీకి క్లిష్టమైన విషయం. అయితే, అన్నామలై వంటి నేతలను రంగంలోకి దించి, సిద్ధాంతపరమైన పోరాటం ద్వారా అక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని మోదీ భావిస్తున్నారు. సనాతన ధర్మం, ఇతర సిద్ధాంతపరమైన అంశాల ద్వారా తమిళనాడులో స్టాలిన్‌ను దెబ్బతీయడానికి బీజేపీ చాలా ప్రయత్నించింది. అయితే అక్కడ బీజేపీని ప్రజలు ఆధరించనప్పటికీ విజయ్ రూపంలో స్టాలిన్ అధికారాన్ని కోల్పొవలసి రావడం బీజేపీకి కలిసివచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సనాతన దర్మం అంశంపై నెలకొన్న వివాదాన్ని తెరపైకి తేవడం ద్వారా తమిళనాడుతో స్టాలిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపటంలో విజయం సాధించింది.
4. బెంగాల్‌లో మమత: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించడం బీజేపీకి ఒక ప్రతిష్టాత్మక సవాలుగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నప్పటికీ, అసెంబ్లీలో దీదీని దాటడం ఇంకా సవాలుగానే ఉంది. అవినీతి అంశాలు, క్షేత్రస్థాయి పోరాటాల ద్వారా బీజేపీ ఆమెను టార్గెట్ చేస్తోంది. అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల అంశాల ద్వారా బెంగాల్‌లో మమతా బెనర్జీని కట్టడి చేసే వ్యూహాలను బీజేపీ అమలు చేస్తోంది. అందులోభాగంగానే ఇటీవల ఎన్నికల్లో మమతను టార్గెట్ చేసుకుని మోదీ, అమిత్ ప్రచారం చేసి విజయం సాధించారనే చెప్పవచ్చు.
ఈ నలుగురిలో కేసీఆర్ మినహా మిగిలిన నాయకులు కూడా జాతీయ స్థాయిలో 'ఇండియా' (INDIA) కూటమిలో కీలకంగా ఉండటంతో, వారిని బలహీనపరచడం ద్వారా 2029 ఎన్నికల నాటికి తిరుగులేని ఆధిక్యం సాధించాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.అయితే, ఈ నలుగురు నాయకులు కూడా ప్రజాకర్షణ గల నేతలు కావడంతో, ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద మోదీ అనుకున్నట్లుగా 'టార్గెట్' అయితే పూర్తయింది, కానీ ప్రాంతీయ అస్తిత్వం (Regional Identity) వర్సెస్ జాతీయవాదం (Nationalism) మధ్య జరుగుతున్న ఈ పోరులో భవిష్యత్తులోప్రజలు ఎవరి వైపు నిలుస్తారో చూడాలి.
Follow Us