/rtv/media/media_files/2024/11/08/tqzBsNF3jmMI6YwcT9JN.jpg)
Simla
హిమాచల్ ప్రదేశ్ అంటేనే చల్లని ప్రదేశానికి పెట్టింది పేరు. అలాంటిది అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణంగా గరంగరం గా మారింది. పోలీసులు ప్రభుత్వాధికారులు పరుగులు పెడుతుండడంతో అందరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఏకంగా రంగంలోకి సీఐడీనే దిగింది. అసలు ఇంతకీ ఏమైంది అంతలా పరుగులు పెట్టాల్సిన అవసరం ఏముందని అంటే... అదేదో ఉగ్రవాదుల వేటో, భారీ ఆర్థిక స్కామో కాదు.. సమోసాలూ, కేకులూ కనిపించకపోవడమే. సమోసాలు పోయాయి అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫోకస్ పెట్టింది.
ఇదెలా ఉందంటే.. చిట్టెలుక కోసం కొండను తవ్వినట్లుంది అని ప్రజలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవలే టాయిలెట్ సీట్ టాక్స్‌తో ప్రజల చేత అభాసుపాలైన సుకు సర్కారుపై మరోసారి జోకుల టపాకులు పేలుతున్నాయి.
#WATCH | Shimla, Himachal Pradesh | On investigation being held regarding the issue of CM Sukhvinder Singh Sukhu's refreshment allegedly served to his staff, BJP leader Kanwar Pyar Singh says, "...Where there is negligence, where there is a lack in the state, where the officials… pic.twitter.com/aD5BBEyJpE
— ANI (@ANI) November 8, 2024
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ ఆసక్తికర కేసు నమోదైనట్లు సమాచారం. అసలేమైందంటే.. అక్టోబర్ 21న కాంగ్రెస్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి, ఒక ఐజీ ర్యాంక్ అధికారి, తన ఆఫీసుకి ఎస్సైని పిలిపించి, సిమ్లాలోని లక్కర్ బజార్‌లో ఉన్న హోటల్ రాడిసన్ బ్లూ నుంచి, సీఎం కోసం కొన్ని స్నాక్స్ తీసుకురావాలని ఆదేశించారు. వాటిని తేవడానికి ఒక ఎఎస్సై, హెచ్‌హెచ్‌సీ డ్రైవర్ ను హోటల్ కు పంపారు.
Also Read: Srisailamశ్రీశైలం దేవస్థానంలో లంచావతారం ఎత్తిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
వారు ఆ హోటల్ నుంచి సమోసాలు, కేక్‌లను మూడు పెట్టెల్లో ఆఫీసుకి తీసుకొచ్చారు. వాటిని మహిళా ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చారు. ఆ మహిళా ఆఫీసర్ ఆ వస్తువులను సీనియర్ అధికారి గదిలో ఉంచినట్లు తెలిపారు. ఆ తర్వాత వాటిని వేరే చోట ఉంచారు, అలా ఆ మూడు పెట్టెలూ చాలా ప్రదేశాలకు చేరాయి.
Also Read: Health TIps: చలికాలంలో కూడా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలా?
ఆ తర్వాత ఆ సమోసాలను సీఎంకి కాకుండా.. సీఎం సిబ్బందికి పెట్టారు. దీంతో ఇలా ఎందుకు జరిగింది అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.
Also Read: Sidney: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్...రన్ వే పై భారీ మంటలు
దర్యాప్తు చేసి.. 3 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చారు. సీఎంకి సెర్వ్ చేసే మెనూలో ఈ సమోసాలూ, కేకులూ లేవని సీఐడీ రిపోర్ట్ వివరించింది. అందువల్లే సీఎంకి వాటిని అందించలేదని, వాటిని సీఎం సిబ్బంది తినేసినట్లు తెలిపారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. సిమ్లా నుంచి ఢిల్లీ వరకూ ఈ విషయం ఇది రచ్చ రేపుతోంది.
ఈ మొత్తం ఘటనపై సీఎం సుకు సైలెంటుగా ఉన్నారు. డీజీపీ సీఐడీ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శుక్రవారం.. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు.. ఢిల్లీ నుంచి సిమ్లా బయలుదేరే ముందు.. సీఐడీ దర్యాప్తు, సమోసా వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన థాంక్యూ అని మాత్రమే అన్నారు.
Also Read: PM Modi: హ్యాపీ బర్త్ డే రేవంత్... మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు!
ఈ మొత్తం ఘటనను బీజేపీ గట్టిగా క్యాష్ చేసుకుంటోంది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసింది అని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రణధీర్ శర్మ సెటైర్ వేశారు. నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అన్న ఆయన.. సీఐడీ విభాగానికి.. సమోసాల మిస్సింగ్‌పై దర్యాప్తు చెయ్యడానికి టైమ్ ఉంటుంది గానీ.. రాష్ట్రంలో అవినీతి కేసుల్ని దర్యాప్తు చెయ్యడానికి కుదరడం లేదని సైటర్లు వస్తున్నాయి.