Charu Pandey : 23 ఏళ్లకే 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరీ చారు పాండే?

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక కల లాంటిది. లక్షలాది మంది ఏళ్ల తరబడి శ్రమిస్తే గానీ రాని ఉద్యోగాన్ని, కేవలం 23 ఏళ్ల వయసులోనే ఏకంగా 19 సార్లు సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

New Update
charu pandey

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక కల లాంటిది. లక్షలాది మంది ఏళ్ల తరబడి శ్రమిస్తే గానీ రాని ఉద్యోగాన్ని, కేవలం 23 ఏళ్ల వయసులోనే ఏకంగా 19 సార్లు సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతకు ఆమె ఎవరంటే చారు పాండే. ఈమె ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో విజయం సాధించింది. ఆమె పాటించిన వ్యూహాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

చారు పాండే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన యువతి. ప్రస్తుతం ఆమెకు 23 ఏళ్లు. చిన్న వయసులోనే దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్షలుగా భావించే బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, రైల్వేస్ వంటి విభాగాల్లో రికార్డ్ స్థాయిలో 19 ఉద్యోగాలకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని కాగ్ ఆఫీసులో అసిస్టెంట్ ఆడిటర్ గా  పనిచేస్తోంది. చారు పాండే సాధించిన ఈ అసాధారణ విజయానికి గుర్తింపుగా ఆమెకు దేశ అత్యున్నత గౌరవం దక్కనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రతిష్టాత్మక అట్-హోమ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. ఈ వేడుకలో ఆమెను రాష్ట్రపతి ప్రత్యేకంగా సత్కరించనున్నారు.

ఆమె క్లియర్ చేసిన పరీక్షల జాబితా చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని టాప్ నోచ్ ఎగ్జామ్స్ అన్నింటినీ ఆమె బ్రేక్ చేసింది.

  • SSC విభాగాలు: SSC CGL, SSC CHSL, SSC MTS, SSC GD, SSC CPO (వీటితో పాటు 2023లో మళ్లీ రాసిన CGL, CHSL, MTS పరీక్షల్లోనూ క్వాలిఫై అయింది).
  • బ్యాంకింగ్ రంగాలు: IBPS PO, IBPS Clerk, SBI PO, SBI Clerk.
  • రైల్వేస్ (RRB): RRB NTPC, RRB Group D (2023లో కూడా గ్రూప్-డి సాధించింది).
  • రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు: ఛత్తీస్‌గఢ్ ఎస్ఐ (CG SI), ఢిల్లీ పోలీస్, CG NHM, ట్రాన్స్‌పోర్ట్ సబ్ ఇన్‌స్పెక్టర్.

టెన్షన్‌తో చదవలేదు

నేను ఎప్పుడూ 19 ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోలేదు. నా టార్గెట్ కేవలం ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే. నా విజయానికి ముఖ్య కారణాలు నిరంతర కృషి, టైమ్ మేనేజ్‌మెంట్. నేను సిలబస్ మొత్తం పూర్తి చేయాలనే టెన్షన్‌తో చదవలేదు. ఎంతవరకు చదివాననేది ముఖ్యం కాదు, చదివిన కాస్తయినా 100% పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. అభ్యర్థులకు నేను చెప్పేది ఒక్కటే.. ఒకసారి పరీక్ష ఫెయిల్ అయితే నిరాశపడకుండా మళ్లీ ప్రయత్నించండి. ప్రతి ప్రయత్నం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది అని ఆమె తెలిపారు.  దేశంలో 0.5 శాతం కంటే తక్కువ సక్సెస్ రేట్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలో చారు పాండే సృష్టించిన హిస్టరీ మాత్రం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి.

Advertisment
తాజా కథనాలు