BIG BREAKING : మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ రిజెక్ట్!

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నటరాజన్ తన నామినేషన్ ఫారంలో దాచిపెట్టారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

New Update
meenashi

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ ఏకైక అభ్యర్థి అయిన మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నటరాజన్ తన నామినేషన్ ఫారంలో దాచిపెట్టారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన ఆస్తి వివరాలలో కూడా ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించింది. బీజేపీ ఫిర్యాదు మేరకు జూన్ 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలలోపు స్పందించాలని కోరుతూ రిటర్నింగ్ అధికారి ఆమెకు నోటీసు జారీ చేశారు. అయితే తిరిగి  ఆమె స్పందించకపోవడంతో రిటర్నింగ్ అధికారి  ఆమె నామినేషన్ రిజెక్ట్ చేశారు. అయితే  దీనిపై హైకోర్టులో తేలక్చుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు