/rtv/media/media_files/2026/06/17/meenakshi-natarajan-case-2026-06-17-15-20-44.jpg)
Meenakshi Natarajan Case
/filters:format(webp)/rtv/media/media_files/2026/06/17/ravi-prakash-2026-06-17-15-22-00.webp)
-RAVI PRAKASH
Meenakshi Natarajan Case: మనదేశంలో ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో ఒకే ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ డిసైడ్ చేయొచ్చా..? పొరపాటున ఆ అధికారి ఏదైనా తప్పు చేస్తే, నష్టపోయిన ఆ అభ్యర్థిని ఎవరు కాపాడతారు? ఇది ఏదో ఊహాజనితమైన ప్రశ్న కాదు. కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అయిన గొడవ నుంచి వచ్చిన ప్రశ్న ఇది. కానీ ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు, నేను ఒక విషయాన్ని క్లియర్ చేయాలను కుంటున్నాను. ఈ వీడియో కాంగ్రెస్ గురించి కాదు. ఈ వీడియో BJP గురించి కాదు. ఈ వీడియో నిజానికి మీనాక్షి నటరాజన్ గురించి కూడా కాదు. ఈ వీడియో వీటన్నింటికంటే బిగ్ ఇష్యూకి సంబంధించింది.ఇది ప్రజాస్వామ్యం గురించి. ఇది ఎన్నికల గురించి. ఇది వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్. కానీ దీని వెనుక ఉన్న రాజ్యాంగ చిక్కుముడిని విప్పడం అంత ఈజీ కాదు.ఒక రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఎంత పవర్ ఉండాలి? ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి సామాన్య పౌరుడికి ఒక పెద్ద షాక్.ఈ రోజు మీనాక్షి నటరాజన్ కావచ్చు. రేపు BJP క్యాండిడేట్ కావచ్చు. ఎల్లుండి ఒక రీజినల్ పార్టీ క్యాండిడేట్ కావచ్చు. లేదా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు. ఇక్కడ సమస్య క్యాండిడేట్ కాదు. సమస్యల్లా పవర్ గురించి. అసలు ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం...
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె నామినేషన్ పేపర్లను రిటర్నింగ్ ఆఫీసర్ చెక్ చేశారు. ఆ చెకింగ్ ప్రాసెస్ లో, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంప్లైంట్ విషయంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆ సమాచారాన్ని దాచారని రిటర్నింగ్ ఆఫీసర్ డిసైడ్ అయిపోయారు. వెంటనే ఆమె నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు. అంతే, మీనాక్షి నటరాజన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఓటింగ్ లేదు. పోటీ లేదు. మద్దతు అడిగే ఛాన్స్ లేదు. ఆమె లేకుండానే ఎన్నికల ప్రాసెస్ ముందుకు సాగింది. ఇప్పుడు ఇక్కడ ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే అసలైన ప్రశ్న ఇప్పుడే మొదలైంది..! మీనాక్షి నటరాజన్‌పై ఏమైనా క్రిమినల్ నేరం రుజువైందా ? లేదు. ఏదైనా కోర్టు ఆమెను దోషిగా తేల్చిందా? లేదు. ఆమెపై కేసులు నమోదయ్యాయా? లేదు. ఏ కోర్టయినా ఆమెను తప్పుపట్టిందా? అదీ లేదు.అయినా ఒక అభ్యర్థిని పోటీ నుండి తీసేశారు. జడ్జి కాదు. కోర్టు కాదు. కేవలం ఒక రిటర్నింగ్ ఆఫీసర్. ఒక్క అధికారి. ఒక్క నిర్ణయం. ఒక్క సంతకం. కానీ, పొలిటికల్‌గా దీని ఎఫెక్ట్ చాలా పెద్దది.
అనుకున్నట్టుగానే ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఇక్కడే ఈ స్టోరీలో బిగ్ ట్విస్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ఒక అభ్యర్థికి సంబంధించిన గొడవను మాత్రమే వినడం లేదు. ఇది భారత ప్రజాస్వామ్య గుండెకాయ లాంటి ప్రశ్నను వింటోంది. ఇలాంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఒక అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపొచ్చా? అలా జరిగితే, సుప్రీంకోర్టుకు వెంటనే జోక్యం చేసుకునే అధికారం ఉందా? లేదా ఎన్నికలు అయిపోయే వరకు వెయిట్చేయాలా? ఇక్కడే సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ మీనాక్షి నటరాజన్ తరపున రంగంలోకి దిగారు.సింఘ్వీ వాదన ప్రకారం, రిటర్నింగ్ ఆఫీసర్ తప్పుగా ప్రవర్తించారు. ఆయన వాదన చాలా సింపుల్ గా ఉంది. ఎన్నికల చట్టం ప్రకారం మీనాక్షి నామినేషన్ రిజెక్షన్ తప్పని.ఆమె విషయంలో రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారని..!మీనాక్షిపై ఎటువంటి నేరం రుజువు కాలేదు. ఎన్నికల చట్టం ప్రకారం ఆమె నామినేషన్‌ను రద్దుచేసేంత ఆధారాలు ఏవీ లేవు.కాబట్టి, సింఘ్వీ ప్రకారం ఈ రిజెక్షన్ లోనే తప్పుంది.
ఇప్పుడు, సింఘ్వీ వాదన కరెక్టా తప్పా అనేది ఒక డిస్కషన్. ఇదే ఇప్పుడు అత్యంత లోతైన చర్చకు దారితీసింది.ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ చేసింది తప్పే అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రశ్న మీనాక్షి నటరాజన్ కంటే చాలా పెద్దది. రేపు ఏ పొలిటికల్ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫేస్ చేశారనే అనుకుందాం. ఆ కంప్లైంట్ కోర్టులో ఇంకా ప్రూవ్ కాలేదనే అనుకుందాం. ఎటువంటి నేరం రుజువు కాలేదు. ఎటువంటి ఆరోపణలు నమోదు కాలేదు. అయినప్పటికీ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను రిజెక్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. అప్పుడు వెంటనే ఉన్న సొల్యూషన్ ఏమిటి?
ఆ అభ్యర్థిని ఎవరు కాపాడతారు? ఎందుకంటే ఒకసారి నామినేషన్ రిజెక్ట్ అయితే, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోవచ్చు. ఎన్నికల టైం ఆగదు. క్యాంపెయిన్ కొనసాగుతుంది.ఓటింగ్ టైం దగ్గరపడుతుంది. గడిచే ప్రతి రోజు పోటీ చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ కేసు ఒక పెద్ద రాజ్యాంగ చర్చకు దారితీసింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి కాదు. పోటీ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుంది అనే దాని గురించి. ఇక్కడే సుప్రీంకోర్టు రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ తప్పు చేశారా లేదా ఒప్పు చేశారా అని తేల్చడానికి కోర్టు తన టైమ్ వేస్ట్ చేయలేదు. అది పూర్తిగా వేరే కాన్‌స్టిట్యూషనల్ రూల్ పై ఫోకస్ పెట్టింది. దశాబ్దాలుగా ఉన్న ఒక రూల్.
ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోకూడదని ఆ రూల్ చెబుతుంది. ఇది మనల్ని ఈ స్టోరీ యొక్క మెయిన్ పార్ట్ లోకి తీసుకెళ్తుంది. ఏది ఎక్కువ ఇంపార్టెంట్? కోర్టుల జోక్యం నుంచి ఎన్నికలను కాపాడటమా? లేదా అభ్యర్థులను ఇష్టానుసారం తీసేయకుండా కాపాడటమా? నెక్ట్స్ ఎపిసోడ్‌లో మనం చూడబోయే రాజ్యాంగ పోరాటం ఇదే.
ఇప్పుడు సుప్రీంకోర్టు విషయానికి వద్దాం.ఎందుకంటే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది.ఈ మ్యాటర్ సుప్రీంకోర్టుకు వెళ్ళగానే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అని జడ్జీలు తేలుస్తారని అందరూ అనుకున్నారు.కానీ అలా జరగలేదు.రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 329’ పై కోర్టు ఫోకస్ పెట్టింది.చాలామందికి ఆర్టికల్ 329 అంటే ఏంటో తెలియకపోవచ్చు.కానీ ఎన్నికల చట్టాల్లో ఇది మోస్ట్ పవర్‌ఫుల్ రూల్.దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్.ఎన్నికల ప్రాసెస్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు అందులో తలదూర్చకూడదు.దీని వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది.ఎలక్షన్స్ మధ్యలో ప్రతి చిన్న గొడవ కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుందో ఊహించండి.రిజెక్ట్ అయినప్రతి నామినేషన్, ఓటర్ల లిస్ట్ గొడవలు, కౌంటింగ్ సమస్యలు.. ఇలా ప్రతిదానికీ కోర్టుకు వెళ్తే ఎన్నికలు అసలు ముందుకు సాగవు.రాజ్యాంగం సరిగ్గా దీన్నే వద్దనుకుంది.అందుకే ఎన్నికల వివాదాలేవైనా ఉంటే, ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఛాలెంజ్ చేయాలని సుప్రీంకోర్టు పదే పదే చెప్తూ వచ్చింది.రాజ్యాంగ పరంగా ఇది కొత్త విషయమేమీ కాదు, ఎప్పటినుంచో ఉన్నదే.కానీ ఇక్కడే సింఘ్వీ చేసిన వాదన చాలా బలంగా మారింది.ఎందుకంటే ఆయన కేవలం ఎన్నికల ప్రాసెస్‌ను ఆపమని కోర్టును అడగడం లేదు.ఆయన ఇంకా లోతైన ప్రశ్న వేస్తున్నారు.రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన పెద్ద తప్పుచేసి, అది మొత్తం ఎలక్షన్ రూపురేఖలనే మార్చేసేలా ఉంటే అప్పుడేం చేయాలి?
ఇక్కడే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.ఎందుకంటే ఈ వాదన దేని గురించో చూడండి.ఎన్నికల్లో ఒక క్యాండిడేట్ ఓడిపోతే అది ప్రజాస్వామ్యం.. ఓటర్లు తిరస్కరిస్తే అది ప్రజాస్వామ్యం.కానీ ఒక క్యాండిడేట్‌ను అసలు పోటీనే చేయనివ్వకపోతే?ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లను లెక్కించడం మాత్రమే కాదు.. క్యాండిడేట్స్‌కు ఓట్లు అడిగే సమాన అవకాశాన్ని ఇవ్వడం కూడా.అందుకే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు చట్ట ప్రకారం ఉండాల్సిన బలమైన కారణాలేవీ ఇక్కడ లేవని సింఘ్వీ పదే పదే వాదించారు.ఇప్పుడు చట్టపరమైన సమస్యను అర్థం చేసుకుందాం.మీనాక్షీ నటరాజన్ తరపు వాదనల ప్రకారం.. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 33A కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వివరాలను బయటపెట్టాలని చెబుతోంది.ముఖ్యంగా తీవ్రమైన నేరాల్లో పాత్ర రుజువైనప్పుడు. లేదా కోర్టు శిక్ష వేసినప్పుడు మాత్రమే.కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులేవీ లేవని మీనాక్షి తరపు వారు వాదిస్తున్నారు.శిక్ష పడలేదు.. తప్పుచేసినట్టు ఆధారాలు నమోదు కాలేదు..కనీసం విచారణ కూడా జరగ లేదు.అలాంటప్పుడు నామినేషన్‌ను ఎలా రిజెక్ట్ చేస్తారు అనేది వారి క్వశ్చన్.ఆ వాదన ఎంతవరకు కరెక్ట్ అనేది కోర్టులు తేలుస్తాయి.కానీ దీనివల్ల ఒక డౌట్ వస్తుంది.ఒకవేళ నామినేషన్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేయాలి?ఇక్కడే ఎలక్షన్ కమిషన్ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయో చూడాలి.
మీనాక్షీ నటరాజన్ సపోర్టర్స్ చూపిస్తున్న వివరాల ప్రకారం.. ఎన్నికల చట్టం ఎప్పుడూ నామినేషన్లు కరెక్టే అనే నమ్మకంతోనే మొదలవుతుంది.తప్పు అనే ఉద్దేశంతో కాదు.నామినేషన్‌లో తప్పు ఉందని నిరూపించాల్సిన బాధ్యత
ఆరోపణలు చేసేవారిదే కానీ, క్యాండిడేట్‌ది కాదు.ఇంకా ముఖ్యంగా, ఏదైనా డౌట్ ఉంటే ఆ బెనిఫిట్ క్యాండిడేట్‌కే దక్కాలని గైడ్‌లైన్స్ చెప్తున్నాయి.దీని ఇంపార్టెన్స్ ఏంటో ఆలోచించండి.ఎందుకంటే నామినేషన్‌ను రిజెక్ట్ చేయడం అనేది ఒక చిన్న ఆఫీస్ పని కాదు.. అది ఒక క్యాండిడేట్‌ను రేసులోంచి పూర్తిగా తీసేయడం.
ఇప్పుడు ఈ చర్చను ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్దాం.ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన నిర్ణయం నిజంగానే తప్పయితే.. దానికి సొల్యూషన్ ఏంటి?సుప్రీంకోర్టు చెప్పిన ఆన్సర్ సింపుల్.. ఎన్నికలు అయిపోయాక 'ఎలక్షన్ పిటిషన్' వేసుకోండి అని.కానీ ఈ పద్ధతిని విమర్శించేవారు ఒక కఠినమైన ప్రశ్న అడుగుతున్నారు.ఎన్నికల ముందే పోటీ చేసే ఛాన్స్ కోల్పోతే.. ఎన్నికల తర్వాత వచ్చే తీర్పు ఆ నష్టాన్ని భర్తీ చేయగలదా?ఆలోచించండి.. ఎలక్షన్స్ అనేవి కోర్టు కేసు లాంటివి కావు.. దానికి ఒక టైమ్ ఉంటుంది.క్యాండిడేట్ ప్రచారం చేస్తారు.. ఓటర్లు ఆలోచిస్తారు.. ఒక పొలిటికల్ వేవ్ క్రియేట్ అవుతుంది.ఇదంతా ఒక నిర్ణీత సమయంలోనే జరగాలి.ఆ ప్రాసెస్ జరగక ముందే క్యాండిడేట్‌ను పక్కన పెడితే.. ఆ కోల్పోయిన అవకాశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా?కొన్నేళ్ల తర్వాత కోర్టు అది తప్పే అని తేల్చినా.. అప్పుడు జరగని ప్రచారాన్ని, పడని ఓట్లను, ఈసారి ఈ క్యాండిడేట్‌కు ఓటేసి గెలిపించాలనుకున్న ఓటర్ల నిర్ణయాన్ని మళ్లీ తీసుకురాగలదా..?ఈ కేసులో ఉన్న అసలైన రాజ్యాంగ చిక్కుముడి ఇదే.
ఇంతలోనే ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్ కోర్టు.. ఈ వివాదానికి కారణమైన ఆ ప్రైవేట్ కంప్లైంట్ తమ పరిధిలోకి రాదని చెబుతూ ఆ కేసును వెనక్కి పంపించేసింది.దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు.
కానీ రాజకీయంగా, చట్టపరంగా ఇది చర్చను మరింత వేడెక్కించింది.ఎందుకంటే విమర్శకులు ఒకే ప్రశ్న అడుగుతున్నారు.కనీసం కోర్టు పరిధిలోకి కూడా రాని ఒక చిన్న విషయంపై ఒక క్యాండిడేట్ నామినేషన్‌ను రిజెక్ట్ చేయగలిగితే.. అసలు రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఎంత పవర్ ఉన్నట్టు? ఆ పవర్ మిస్‌యూజ్ కాకుండా ఉండేందుకు ఎలాంటి రక్షణలు ఉన్నాయి?ఇవి ఎన్నికలకు వ్యతిరేకంగా అడుగుతున్న ప్రశ్నలు కావు.. ప్రజాస్వామ్యానికి సపోర్ట్‌గా అడుగుతున్న ప్రశ్నలు.ఎందుకంటే ప్రతి ప్రజాస్వామ్య దేశం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. అసలు గేట్ కీపర్లను కనిపెట్టుకుని ఉండేది ఎవరు?దీనివల్ల ఇండియా ఎన్నికల వ్యవస్థలో ఏదైనా లోపం బయటపడిందా?
రిటర్నింగ్ ఆఫీసర్ క్యాండిడేట్ భవితవ్యాన్ని తేల్చేయగలరు.. కానీ ఎన్నికలు ముగిసేవరకు సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు అనే పరిస్థితి ఉందా?ఇక్కడే ఈ చర్చ మీనాక్షీ నటరాజన్, కాంగ్రెస్, బీజేపీలను దాటి.. భవిష్యత్తు ప్రజాస్వామ్యం వైపు వెళ్తుంది.
ఈ కథ మీనాక్షీ నటరాజన్ గురించి కాదు.. కొన్నేళ్ల తర్వాత ఆమె పేరు కూడా ఎవరికీ గుర్తుండకపోవచ్చు.కానీ ఈ కేసు లేవనెత్తిన రాజ్యాంగ ప్రశ్న ఎప్పటికీ గుర్తుంటుంది.ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్ ఒక అభ్యర్థి ఫ్యూచర్‌ను డిసైడ్ చేయొచ్చా..?ఒకవేళ ఆ నిర్ణయంపై అభ్యర్థికి అభ్యంతరం ఉంటే, ఎలక్షన్స్ ముగిసేలోపే అతనికి దొరికే రక్షణ ఏంటి? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. సుప్రీంకోర్టు మీనాక్షీ నటరాజన్ వాదన తప్పని చెప్పలేదు.. అలాగని రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం కరెక్ట్ అని కూడా అనలేదు.రాజ్యాంగ రూల్స్ ప్రకారం ఈ పోరాటం వేరే పద్ధతిలో జరగాలని మాత్రమే చెప్పింది.దీని అర్థం లీగల్ పోరాటం ఇంకా ముగిసిపోలేదు.కానీ ప్రజాస్వామ్య చర్చ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది.ఎందుకంటే అందరూ ఒప్పుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి పరీక్ష ఎదురవదు..పవర్‌ను ఉపయోగించినప్పుడే పరీక్ష మొదలవుతుంది.పవర్ ఉన్నప్పుడు జవాబుదారీతనం కూడా ఉండాలి.ఇప్పుడు ఇండియాముందున్న ప్రశ్న చాలా సింపుల్.అసలు గేట్ కీపర్‌ని ప్రశ్నించేది ఎవరు?ఒకవేళ ఆ గేట్ కీపరే తప్పు చేస్తే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజాస్వామ్యానికి ఎంత టైమ్ పడుతుంది? ఇదే అసలైన కథ.. ఇదే అసలైన చర్చ. అందుకే ఈ కేసు కేవలం ఒక లీడర్ గురించో,ఒక ఎలక్షన్ గురించో కాదు.. మనందరి గురించి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అనేది ఊరికే వచ్చిన వరం కాదు.. అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు బేస్ లాంటిది.ఆ బేస్‌నే ప్రశ్నించినప్పుడు, ప్రతి పౌరుడూ సమాధానం కోసం వెయిట్ చేయడం సహజం.
Follow Us