/rtv/media/media_files/2024/12/02/Tajv6aO7jcdL3BBKEPaW.jpg)
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతులు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంటును ముట్టడించేందుకు వేలాది మంది రైతులు అక్కడికి పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. రైతుల పాదయాత్రతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారతీయ కిసాన్ పరిషత్ (BKP) నేత సుఖ్‌బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం.. న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టనున్నారని పేర్కొన్నారు.
#WATCH | Noida, Uttar Pradesh: Traffic congestion seen at Chilla Border as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today.
— ANI (@ANI) December 2, 2024
(Drone visuals; shot at 12:10 PM) pic.twitter.com/8DguXl6u9Z
Also Read: సంక్రాంతి తర్వాత రైతుభరోసా.. కొత్త రూల్స్ ఇవే.. వారికి కట్?
అయితే ఢిల్లీలో రైతుల ఆందోళనలపై తమకు ముందస్తు సమాచారం అందినట్లు తూర్పు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నందువల్ల రైతుల పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పారు.
Also Read: మహారాష్ట్రలో సీఎం ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ కీలక ఆదేశాలు!
#WATCH | Uttar Pradesh | Farmers under different farmer organisations protest near Dalit Prerna Sthal in Noida as they are not allowed to enter Delhi pic.twitter.com/JMVaeYp872
— ANI (@ANI) December 2, 2024
డిసెంబర్ 6 నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా తమ అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెబుతున్నారు.
#WATCH | Noida, UP | Protesting farmers climb over police barricades at Dalit Prerna Sthal as they march towards Delhi over their various demands pic.twitter.com/39xs9Zx5mn
— ANI (@ANI) December 2, 2024
Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం