Fire Accident : ఘోర అగ్నిప్రమాదం: 150 ఇళ్లు బూడిద!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో  దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.

New Update
fire accident

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో  దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో నిరుపేదలైన వందలాది మంది తలదాచుకునే నీడను కోల్పోయారు. కనావని ప్రాంతంలోని ఒక స్క్రాప్ గోదాంలో మంటలు మొదలయ్యాయి.

22 ఫైర్ ఇంజన్లను రంగంలోకి

ఆవాస్ వికాస్ అథారిటీకి చెందిన స్థలంలో ఈ గోదాం ఉంది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో పక్కనే ఉన్న గృహ సముదాయాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు ఘజియాబాద్‌తో పాటు పక్కనే ఉన్న నోయిడా నుండి కూడా మొత్తం 22 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. మంటలను అదుపు చేసేందుకు ఘజియాబాద్‌తో పాటు పక్కనే ఉన్న నోయిడా నుండి కూడా మొత్తం 22 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 సమాచారం అందిన వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్, చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం పరిపాలన విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు