లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!

గుజరాత్‌లో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో తన బట్టలు వేసింది. దీని కారణంగా తను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. రెండు నెలల తర్వాత ఆ ప్రేమ జంట పోలీసులకు చిక్కింది.

New Update
Gujarat

ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయేందుకు స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే ఆ ప్రేమ జంట తమకు తెలియని ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో ఆ మహిళ తన బట్టలు, చెప్పులు వేసింది. దీని కారణంగా తాను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు వేరోక ప్రాంతానికి వెళ్లి రెండు నెలలు కలిసి జీవించింది. ఆ తర్వాత పోలీసులకు చిక్కారు. మొత్తంగా సినిమా రేంజ్‌లో ఆ ప్లాన్ వేసిందీ ప్రేమ జంట. వివరాల్లోకి వెళితే..

సినిమాను తలపించే ట్విస్టులు

గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రామి కేరియా, అనిల్ గంగన్ అనే జంట గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరూ కలిసి పారిపోతున్న క్రమంలో ఓ వృద్ధుడిని చంపేసి నిప్పంటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ వృద్ధుడికి నిప్పంటించిన తర్వాత వివాహిత రామి తన బట్టలు, చెప్పులు, ఫోన్‌ను ఆ మంటల్లో శవం వద్ద పడేసింది. అంటే రామి మంటల్లో చనిపోయిందని తన ఫ్యామిలీ, ఇతరులను నమ్మించాలనుకుంది. ఆ తర్వాత తన లవర్‌తో హ్యాపీగా జీవించాలనుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. 

ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు

జూలై 3న ప్లాన్ సక్సెస్ అయింది. ఆ తర్వాత గ్రామం వదిలి ఆ జంట పారిపోయింది. ఆ మరుసటి రోజు రామి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో అనిల్ వచ్చి గమనించాడు. రామి మంటల్లోనే కాలి చనిపోయిందని ఫ్యామిలీ కూడా నిజంగానే అనుకున్నారు. అనిల్ కూడా హమ్మయ్య తమకు ఇక ఎలాంటి అడ్డూ లేదని నిర్ణయానికి వచ్చాడు. దీంతో రెండు నెలల తర్వాత రామి, అనిల్ కచ్‌కి వచ్చి ఒక రూమ్‌లో అద్దెకు దిగారు.

ఇది కూడా చదవండి: యువకుడి ప్రాణం తీసిన డీజే సౌండ్.. ఏమైందంటే?

కానీ ఏమైందో ఏమో కానీ.. తమ ప్లాన్ సక్సెస్ కాలేదని భావించారు. దీంతో సెప్టెంబర్ 27న రామి తన తప్పును అంగీకరించమని తండ్రి వద్దకు వచ్చింది. జరిగిందంతా చెప్పింది. కానీ రామి తండ్రి అంగీకరించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు