మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. చివరికి ఏం జరిగిందంటే ?

రాజస్థాన్‌లోని నీమ్‌ క థానా అనే జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను కలిసేందుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

New Update
Crime 2

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మహిళలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను కలిసేందుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నీమ్‌ క థానా అనే జిల్లాలోని బన్సూర్‌లో 25 ఏళ్ల ముఖేష్ కుమార్ మీనా టెంట్ వ్యాపారం చేస్తున్నాడు. 

Also Read: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

ఏడాది క్రితం తమ ప్రాంతానికి సమీపంలో ఉన్న రావత్ మజ్రా అనే గ్రామంలోకి పని కోసం వెళ్లాడు. దీంతో ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ అతడికి పరిచయమయ్యింది. అయితే అక్టోబర్ 16న రాత్రి సమయంలో ముఖేష్ కుమార్ రావత్ మజ్రా గ్రామానికి వెళ్లాడు. ఆ మహిళను కలిసేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అతడికి వివాహేత సంబంధం ఉందని ఆ మహిళ అత్తింటివారు అనుమానించారు. ముఖేష్‌ను పట్టుకొని బంధించి దారుణంగా కొట్టారు. 

Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ముఖేష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతి సోదరి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు. ఆ మహిళ అత్తమామలతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. 

Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

ఇదిలాఉండగా హర్యానాలో కూడా ఓ దారుణం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆమె భర్త అనుమానించాడు. చివరికి అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చాడు. తన స్నేహితుడితో కలిసి గొంతు పిసికి హత్య చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తితో పాటు అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు