Rafale Jets: డ్రాగన్, పాక్ దేశాలకు బిగ్ షాక్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులోకి 114 అత్యాధునిక రాఫెల్ జెట్లు

భారత వైమానిక దళం మరో ముందడుగు వేసింది. దేశ రక్షణలో కీలకమైన యుద్ధ విమానాల కొరతను తీర్చడమే లక్ష్యంగా.. 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రెడీ అయ్యింది.

New Update
FotoJet (10)

భారత వైమానిక దళం మరో ముందడుగు వేసింది. దేశ రక్షణలో కీలకమైన యుద్ధ విమానాల కొరతను తీర్చడమే లక్ష్యంగా.. 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రెడీ అయ్యింది. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి ఈ విమానాలను సేకరించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు దాడులకు పాల్పడితే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత ప్రభుత్వం కేవలం విమానాలను అక్కడి నుంచి కొని తీసుకురావడమే కాకుండా.. ఇక్కడే తయారు చేయాలనే నిబంధన విధించింది. దీనివల్ల అత్యాధునిక విమానాల తయారీ సాంకేతికత భారత్‌కు అందుతుంది. దీనివల్ల వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. 

ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

పాత మిగ్-21 వంటి విమానాలు..

వాయుసేన దగ్గర యుద్ధ విమానాల సంఖ్య తక్కువగానే ఉంది. పాత మిగ్-21 వంటి విమానాలను దశలవారీగా తొలగిస్తున్న క్రమంలో.. కొత్త విమానాల అవసరం చాలా ఉంది. ఇప్పటికే మన వద్ద ఉన్న 36 రాఫెల్ విమానాలు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు మరో 114 విమానాలు వాయుసేనలో చేరితే.. మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయి. అన్ని విమానాలు ఒకే రకానికి చెందినవి కావడం వల్ల పైలట్లకు శిక్షణ ఇవ్వడంలో ఈజీ అవుతుంది. ఇది గగనతలంపై భారత్‌కు ఎదురులేని ఆధిపత్యాన్ని ఇస్తుంది.

ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

ఈ కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే కీలక దశకు చేరుకుంది. విమానాల కోసం కావాల్సిన 'లెటర్ ఆఫ్ రిక్వెస్ట్' పంపే ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం దీనిని ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌గా భావిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కీలక ఒప్పందంపై సంతకాలు పూర్తి చేసి ప్రక్రియను ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు నిరంతరం తమ వైమానిక శక్తిని పెంచుకుంటున్నాయి. రాఫెల్ విమానాల్లో ఉండే అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, రక్షణ వ్యవస్థలు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి.

ఇది కూడా చూడండి: Pawan Kalyan : శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు... ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలనం!

Advertisment
తాజా కథనాలు