BIG BREAKING: మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలుపు

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది తెలిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్‌ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మేజిగ్‌ ఫిగర్‌ను దాటి 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.

New Update

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది తెలిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్‌ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 48 స్థానాలకే పరిమితమైపోయింది. ఇక ఇతరులు 21 స్థానాల్లో మెజార్టీలో ఉన్నారు. మొత్తానికి మహారాష్ట్రంలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చినట్లేనని స్పష్టమవుతోంది. 

ఝార్ఖండ్‌లో బీజేపీకి బిగ్‌ షాక్ తగిలింది. అక్కడ ఇండియా కూటమి మేజిగ్‌ ఫిగర్‌ను దాటి 52 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి కేవలం 28 స్థానాల్లోనే మెజార్టీలో ఉంది. ఇక్కడ చూస్తే.. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

National Herald case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..  సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!

కాంగ్రెస్ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది.  కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్‌ తీసుకోలేమని స్పష్టం చేసింది.

New Update
ed-sonia

ed-sonia

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా..  అందుకు కోర్టు నిరాకరించింది.  కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ తీసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.  నేషనల్ హెరాల్డ్ కేసులో తదుపరి విచారణను మే 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని సంబంధిత పత్రాలను తీసుకురావాలని కోర్టు ఈడీని కోరింది. వాటిని పరీక్షించిన అనంతరం నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.  

సీబీఐ విచారణ మధ్యలోనే

కాగా నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో   సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ లను ఈడీ అధికారులు గతంలో చాలు సార్లు విచారణకు పిలిపించి విచారించారు.   విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పెంచి పోషించారన్న ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. అయితే సీబీఐ విచారణ మధ్యలోనే అగిపోయినప్పటికీ ఈడీ మాత్రం దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.

ఈ కేసులో 2023 నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వారిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలతో పాటుగా ఆ పార్టీకి  చెందిన నేతలు శామ్‌ పిట్రోడా, సుమన్‌ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్‌ కంప్లయింట్‌ దాఖలు చేశారు.  

Advertisment
Advertisment
Advertisment