Monalisa: పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా.. వరుడు ఎవరో తెలుసా ?

కుంభమేళా సమయంలో పూసలమ్ముకుని ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే అనే యువతి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కేరళలోని తిరువనంతరపురంలో ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది.

New Update
Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

Mahakumbh Mela sensation Monalisa Bhosle ties knot with boyfriend at Kerala temple

కుంభమేళా సమయంలో పూసలమ్ముకుని ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే అనే యువతి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కేరళలోని తిరువనంతరపురంలో ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి.శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ముందుగా ఈరోజు మోనాలిసా, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తామిద్దరం ప్రేమించుకున్నామని.. తన తల్లిదండ్రులు వారి ప్రేమను ఒప్పకోవడం లేదని ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. అనంతరం గుడిలోకి వెళ్లి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

వరుడు ఎవరు ?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏడాదిన్నరగా వీళ్లు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి మోనాలిసా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ది డైరీ ఆఫ్‌ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు వచ్చారు. ఆమె తండ్రి కూడా అక్కడికి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి తమకు ప్రాణహాని ఉందని భయపడిన మోనాలిసా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరువనంతపురానికి వెళ్లింది. అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఫర్మన్‌ ఖాన్‌తో పెళ్లికి ఒప్పుకోవడం లేదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు మోనాలిసా తెలిపింది.  

తాను ఫర్మన్ ఖాన్‌తోనే కలిసి జీవించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆ జంటకు భద్రత కల్పించారు. వాళ్లిద్దరూ తిరువనంతపురంలోనే ఓ ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు సినిమా షూటింగ్ టీమ్‌తో పాటు మంత్రి వి.శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ కూడా హాజరైనట్లు సమాచారం. 

Advertisment
తాజా కథనాలు