/rtv/media/media_files/2026/04/13/love-jihad-2026-04-13-20-51-52.jpg)
Love Jihad at TCS Nashik campus
Love Jihad : ఐటీ కంపెనీలో జాబ్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు.? మంచి కెరీర్, లక్షల్లో జీతం..లైఫ్ సెటిల్ అనుకుంటాం కదా.? కానీ నాసిక్ TCS ఆఫీసులో జరిగిన స్టోరీ వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కథ కాదు..సైలెంట్‌గా జరుగుతున్న ఓ భయంకరమైన కుట్ర. ఏప్రిల్ 12న బయటపడిన ఈ కార్పొరేట్ జిహాద్ స్టోరీ సంచలనంగా మారింది. అసలు నాసిక్ TCS ఆఫీసులో అమ్మాయిలకు ఎదురైన అనుభవాలేంటో ఈ స్టోరీలో చదవండి
టీసీఎస్ నాసిక్ క్యాంపస్ లో లవ్ జిహాద్ వ్యవహారం సంచలనంగా మారింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్‌ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. దీనిపై టీసీఎస్ స్పందించింది. అరెస్టయిన ఉద్యోగులను సస్పెండ్ చేశామని వెల్లడించింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది.
అసలేంజరిగిందంటే?
నాసిక్ క్యాంపస్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో ఏడుగురు మహిళలు కూడా ముందుకొచ్చి.. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్యకాలంలో తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్‌ఆర్ మేనేజర్ సహా అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వారంతా మహిళ ఉద్యోగులను అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్, నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని పోలీసులకు తెలిపారు. ఆఫీసులో కొంతమంది సీనియర్లు మహిళా ఉద్యోగులను టార్గెట్ చేశారు. నమాజ్ చెయ్యాలి, రోజా ఉండాలి అని అమ్మాయిలపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లకి ఇష్టం లేకపోయినా బీఫ్ తినమని ఫోర్స్ చేశారు. మేము చెప్పినట్టు వింటే మీకు ప్రమోషన్లు ఇస్తాం, ఫారిన్ పంపిస్తామని నమ్మించారు.
కేవలం మతం మార్చడమే కాదు, అంతకంటే దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసి వాళ్లని బ్లాక్‌మెయిల్ చేశారట. ఒకవేళ ఎవరికైనా చెబితే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారు. ఆఫీసులో ఉండాల్సిన ప్రొఫెషనలిజం ఎక్కడా కనిపించలేదు.
ఈ మ్యాటర్ ఎప్పుడైతే బయటపడిందో, మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ కోసం స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దింపింది. మొదట పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్‌లోకి ఉద్యోగుల్లా ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిపై వచ్చిన అభియోగాలపై 40కి పైగా సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లేడీ HR మేనేజర్‌తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే..ఇంత గొడవ జరుగుతున్నా కూడా HR మేనేజర్ పట్టించుకోలేదట. అందుకే ఆమెను కూడా లోపల వేశారు. బాధితుల తరపున నిలబడాల్సిన వాళ్లే, తప్పు చేసిన వాళ్లకు సపోర్ట్ చేయడం ఇక్కడ దారుణం."
ఆరోపణలు వచ్చిన వెంటనే TCS రియాక్ట్ అయింది. కంపెనీలో ఇలాంటి వాటికి అస్సలు చోటు లేదని చెబుతూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ ఉద్యోగాల నుంచి తీసేసింది. కంపెనీ ఇమేజ్ డామేజ్ అవ్వకుండా ఇన్వెస్టిగేషన్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు.ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. ఇలాంటి స్ట్రాటజీ కేవలం నాసిక్ లోనే ఉందా..వేరే సిటీల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా..అన్నది పోలీసులు తేల్చాలి. ఐటీ ఉద్యోగం అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు, మన గౌరవాన్ని, మన నమ్మకాలను కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ అని ఈ కేసు నిరూపించింది.
Follow Us