Metro : మెట్రోలో కరెంట్ పోతే టెన్షన్ వద్దు..  గ్రిడ్ ఫెయిల్ అయినా రైలు ఆగదు!

కొల్‌కతా మెట్రో ప్రయాణికుల రక్షణ కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) అనే కొత్త పద్ధతిని మెట్రో రైల్వే ప్రారంభించింది.

New Update
metro

కొల్‌కతా మెట్రో ప్రయాణికుల రక్షణ కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) అనే కొత్త పద్ధతిని మెట్రో రైల్వే ప్రారంభించింది. దీనివల్ల పొరపాటున పవర్ కట్ అయినా లేదా గ్రిడ్ ఫెయిల్ అయినా ప్రయాణికులు టన్నెల్ మధ్యలో చిక్కుకుపోయే ప్రమాదం ఉండదు.

కొత్త బ్యాటరీ సిస్టమ్ ఉంటే

సాధారణంగా పవర్ పోతే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. కానీ ఈ కొత్త బ్యాటరీ సిస్టమ్ ఉంటే, కరెంట్ లేకపోయినా సరే రైలును గంటకు 55 కిలోమీటర్ల వేగంతో నడిపి సమీపంలోని స్టేషన్ వరకు సురక్షితంగా తీసుకురావచ్చు. ఈ బ్యాటరీ ద్వారా కేవలం రైలును నడపడమే కాకుండా, స్టేషన్లలో గాలి ఆడేలా చేసే 'వెంటలేషన్' మరియు లైట్లను కూడా ఆన్ చేయవచ్చు. దీనివల్ల ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు.

ఈ సిస్టమ్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఇందులో వాడేవి గ్రీన్ బ్యాటరీలు, ఇవి దాదాపు 14 ఏళ్ల వరకు పనిచేస్తాయి. పాతకాలపు జనరేటర్ల లాగా వీటివల్ల కాలుష్యం ఉండదు. అంతేకాదు, కరెంట్ వాడకం పెరిగినప్పుడు ఈ బ్యాటరీలు పవర్‌ను మేనేజ్ చేస్తాయి కాబట్టి మెట్రో కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. కొల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ మిశ్రా మాట్లాడుతూ, ఇది ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన బ్యాకప్ ప్లాన్. దీనివల్ల ఎమర్జెన్సీ సమయంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగదని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు