Kiren Rijiju : దేశాన్ని విభజించకండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కౌంటర్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు.

New Update
Kiren Rijiju

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రాంతాల పేరిట దేశాన్ని విభజించవద్దని, ఏ ప్రాంతానికి చెందినవారైనా మనమంతా భారతీయులమేనని ఆయన స్పష్టం చేశారు. 

ఇటీవల బెంగళూరు సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలను విస్మరిస్తూ, కేవలం ఉత్తరాదికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. "ప్రస్తుతం దేశ ప్రధాని ఉత్తరాది వ్యక్తి, రాష్ట్రపతి కూడా ఉత్తరాది వారే. ఎందుకంటే మమ్మల్ని ప్రతిబింబించే శక్తి బీజేపీకి లేదు" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దక్షిణాది రాష్ట్రాలు చెల్లించే పన్నులను ఉత్తరాది అభివృద్ధికి వాడుకుంటున్నారని, ఢిల్లీలో తాము రెండో శ్రేణి పౌరులుగా  బతకాలని అనుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.  

మనమంతా భారతీయులం

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం ఉందని ఫ్యాక్ట్-చెక్ చేస్తూ రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. "దేశ రాష్ట్రపతి  ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక నిరుపేద, అంకితభావం గల గిరిజన మహిళ. ప్రధానమంత్రి పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌లో జన్మించిన దార్శనికత కలిగిన నాయకుడు. ఇక ఉపరాష్ట్రపతి దక్షిణాదికి చెందిన వారు" అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ లాగే దేశాన్ని విభజించడానికి ప్రయత్నించవద్దని, మనమంతా భారతీయులమేనని హితవు పలికారు 

Advertisment
తాజా కథనాలు