Delimitation Bill :దేశ రాజకీయాల్లో కీలక మార్పులు : మరోసారి తెరమీదకు డీలిమిటేషన్ బిల్లు ?

భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.

New Update
FotoJet - 2026-06-05T095934.524

lok-sabha

Delimitation Bill : భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా దేశంలోని పార్లమెంటు నియోజకవర్గాల సరిహద్దులను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకు ఏప్రిల్ నెలలోనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండో వంతు (2/3) మద్దతును సాధించలేకపోయింది. నాడు సభకు హాజరైన మొత్తం 528 మంది సభ్యులలో 298 మంది బిల్లుకు మద్దతు తెలపగా, 230 మంది వ్యతిరేకించారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 352 ఓట్లు రాకపోవడంతో ఆ సమయంలో లోక్‌సభలో ఈ బిల్లులు వీగిపోయాయి.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి బిల్లును పార్టీల మధ్య రాజకీయ అంశంగా మార్చకుండా ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిశీలించి, వారిని ఒప్పించే ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించింది. చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే ముందే ఒక సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రతినిధులు ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నారు.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి అంశాలవారీగా మద్దతు లభించే అవకాశాలు మెరుగయ్యాయి.

 పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సమ్మతం లేకుండానే రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. దీంతో టీఎంసీ ఎంపీల్లో ఎన్డీఏకు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోందని సమాచారం. అటు తమిళనాడులో కాంగ్రెస్‌తో బంధాన్ని తుంచుకున్న డీఎంకే, ఇండియా కూటమికి దూరంగా జరుగుతోంది. గతంలో డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన టీఎంసీ, డీఎంకేలు సైతం ఇప్పుడు కేంద్రంతో చర్చలకు సంసిద్ధత వ్యక్తంచేయడం గమనార్హం.కొత్త బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. అయితే, పెంచిన స్థానాలలో 816 సీట్లను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్యను రెట్టింపు (డబుల్) చేయడం ద్వారా ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, కేవలం మహిళా సీట్లను అకామడేట్ చేయడానికే ఈ పునర్విభజన చేస్తున్నామని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి.

 ప్రస్తుతం లోక్‌సభ స్థానాల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతోంది. జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు, కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తమకు ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన, సమతుల్యమైన ఒక కొత్త ఫార్ములాను రూపొందించే పనిలో కేంద్రం నిమగ్నమైంది.రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఎన్సీపీ (సునేత్రా పవార్ వర్గం), ఉద్ధవ్ ఠాక్రే శివసేన వంటి ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో ఓటింగ్ రోజున హాజరుకాకుండా (ఆబ్సెంట్) పరోక్షంగానైనా సహాయపడతాయని కేంద్రం ఆశిస్తోంది. అన్ని పార్టీల మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరిన వెంటనే ఈ చట్టం దేశ భవిష్యత్తు ఎన్నికల ముఖచిత్రాన్ని శాసించనుంది.

Advertisment
తాజా కథనాలు