Elephant rampage: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

కేరళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. థ్రిస్సూర్​లోని ఓ ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 36మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఉత్సవాల్లో టపాసులు పేల్చడంతో ఏనుగులు ఇలా చేశాయని సమాచారం

New Update
Elephant rampage Kerala temple festival

Elephant rampage Kerala temple festival

Elephant rampage Kerala temple festival

కేరళలోని థ్రిస్సూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం కోయిలాండిలోని కురువంగాడ్‌, మనకులంగరలో జరిగిన ఆలయ ఉత్సవంలో రెండు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అదే సమయంలో మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Also Read: Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ .. దీనికంటే వరుణ్ తేజ్ మట్కా బెటర్ అంట!

ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితులను అమ్ముకుట్టి (70), లీలా (65), రాజన్ (70)గా పోలీసులు గుర్తించారు. పారిపోయే ప్రయత్నంలో కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై మరణించినట్లు తెలిసింది. 

Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్‌ అంగీకారం!

టపాసుల కారణంగా బీభత్సం

పోలీసుల ప్రకారం.. ఆలయ ఉత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. దీంతో టపాసుల శబ్దాలతో ఒక ఏనుగు భయపడిపోవడంతో గందరగోళం మొదలైంది. ఆ భయంతో ఏనుగు సమీపంలో నిలబడి ఉన్న మరో ఏనుగుపై దాడి చేసింది. రెండు ఏనుగుల మధ్య ఘర్షణ తొక్కిసలాటకు దారితీసింది. 

Also Read: Fastag: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

దీంతో ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి ఆలయంలోని ప్రజలు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది. అందులో కొందరు కింద పడిపోవడంతో తొక్కిసలాటకు గురయ్యారు. ఇంకొందరు ఏనుగుల కాళ్ల కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 

అనేలా-కురువంగడ్ వార్డు కౌన్సిలర్ బిందు పిబి మాట్లాడుతూ.. ఒక ఏనుగు దూకుడుగా ప్రవర్తించడం వల్ల మరొక ఏనుగు రెచ్చగొట్టడంతో పరిస్థితి మరింత దిగజారిందని వివరించారు. "తర్వాత జరిగిన భయాందోళనలో, చాలా మంది ఉత్సవానికి హాజరైన వారు గాయపడ్డారు. చివరికి ఏనుగులను వాటి సంరక్షకులు లొంగదీసుకున్నారు" అని ఆమె అన్నారు.

ఈ విషాద సంఘటనపై అటవీ మంత్రి ఎ.కె. శశీంద్రన్ స్పందించారు. ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల వాడకానికి సంబంధించిన అన్ని భద్రతా నిబంధనలను పాటించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుండి వివరణాత్మక నివేదికను కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు