Karnataka : సిద్దరామయ్యకు దిమ్మతిరిగే షాక్..కాంగ్రెస్ హైకమాండ్ సంచలనం!

కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్.  సాయంత్రం 4గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. సీఎంతో పాటుగా చేయనున్న 13 మంది కేబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది .

New Update
siddaramaih

కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్.  సాయంత్రం 4గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొన్ని గంటల ముందు సీఎంతో పాటుగా చేయనున్న 13 మంది కేబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది . జి. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ నిర్ణయించగా, ఈ జాబితాలో యతీంద్ర సిద్దరామయ్య, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్ పేర్లు ఉన్నాయి.  రాజ్యసభ ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించే అవకాశం ఉంది. యూటీ ఖాదర్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఆయననకు మంత్రి వర్గంలో చోటు దక్కింది.

డిప్యూటీ సీఎం ఇవ్వాలని 

అయితే మాజీ సీఎం సిద్దరామయ్య తన కొడుకుకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని స్వయంగా రాహుల్ గాంధీని కలిసి కోరగా అధిష్టానం మాత్రం ఉపముఖ్యమంత్రిగా  జి. పరమేశ్వరను ఖరారు చేసింది. అయితే యతీంద్ర సిద్దరామయ్య మంత్రి వర్గంలో చోటు ఖారరు అయినప్పటికీ ఆయనకు ఎలాంటి శాఖ అప్పగిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విడి సతీషన్ (కేరళ), రేవంత్ రెడ్డి (తెలంగాణ),  సుఖ్వీందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) హాజరుకానున్నారు . కాగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గత వారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో సీఎం పదివి చేపట్టేందుకు శివకుమార్‌కు మార్గం సుగమమైంది.   కాంగ్రెస్ హైకమాండ్ 2028 అసెంబ్లీ, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు