Karnataka : ప్రయాణికులకు బిగ్ షాక్: పెరగనున్న బస్సు ఛార్జీలు.. అర్ధరాత్రి నుంచే అమలు!

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం అప్పుడే సామాన్యుడి జేబుపై పడటం మొదలైంది. తాజాగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు టికెట్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

New Update
karnataka

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం అప్పుడే సామాన్యుడి జేబుపై పడటం మొదలైంది. తాజాగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు టికెట్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూట్లను బట్టి 20 నుంచి 30 శాతం మేర ఛార్జీలు పెరగబోతున్నాయి. ఈ పెరిగిన ధరలు ఈరోజు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెరగడంతో బస్సు యజమానులకు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీనివల్ల ఒక్కో సీటుపై సగటున రూ. 200 వరకు అదనంగా భారం పడనుంది. 

బెంగళూరు నుంచి బెల్గాం వరకు గతంలో రూ. 1,000–1,200 మధ్య ఉండగా, ఇకపై అది రూ. 1,350 నుంచి 1,400 వరకు చేరుకుంటుంది. బెంగళూరు నుంచి మంగళూరు/ఉడుపి వరకు  ప్రస్తుతం రూ. 900–1,000 మధ్య ఉన్న ఛార్జీలు, రేపటి నుంచి రూ. 1,100–1,200 కి పెరిగే అవకాశం ఉంది.

తీవ్ర నష్టాల్లో ఉన్నాం

కర్ణాటక స్టేట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నటరాజ్ శర్మ మాట్లాడుతూ.. ఇప్పటికే అధిక రోడ్డు టాక్స్‌లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా డీజిల్ ధరల పెంపుతో ఒక్కో బస్సుపై నెలకు అదనంగా రూ. 15,000 భారం పడుతుందని, అందుకే ఛార్జీలు పెంచక తప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పన్నులు తగ్గించాలని లేదా సబ్సిడీలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు