/rtv/media/media_files/2025/01/22/jADSGeNRghow2ip09h0J.jpg)
jeemain Photograph: (jeemain)
దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు (JEE Main Exams) ప్రారంభం అయ్యాయి. ఏపీ, తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కాగా.. ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
Also Read : ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
JEE Main Exams Today
2025 జనవరి22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. చివరి రోజు 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకోగా.. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ నెలలో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు జరుగుతాయి. మే 18న అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్స్‌లో కనీస అర్హత సాధిస్తేనే జేఈఈ అడ్వాన్స్ రాసేందుకు వీలుంటుంది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) రాసేందుకు అవకాశం ఉంటుంది.
Also Read : గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్
కాగా దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు, 23 ఐఐటీల్లో 17 వేల 600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8 వేల 500, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్ రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి..
Also Read : బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్