/rtv/media/media_files/2026/04/17/delhi-blast-probe-2026-04-17-15-00-25.jpg)
Delhi Blast Probe
గతేడాది ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్ర నెట్‌వర్క్‌పై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్‌లో పాల్గొన్న నిందితులు తమ ఇళ్లల్లోనే పేలుడు పదార్థాలు తయారుచేసినట్లు తెలిసింది. శ్రీనగర్‌లో నమోదైన FIR ఆధారంగా దర్యాప్తు సంస్థ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో10 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరో నలుగురు డాక్టర్లు ఉన్నారు.
ఈ టెర్రర్ నెట్‌వర్క్‌లో ఉన్న నిందితులు ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP)ని వినియోగించినట్లు విచారణలో తేలింది. ఇది అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం. సాధారణ మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలతో పోల్చిచూస్తే దీన్ని సులువుగా తయారు చేయవచ్చు. మార్కెట్లో దొరికే కెమికల్స్‌తో దీన్ని తయారుచేయవచ్చు. ఈమధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉగ్రదాడుల్లో TATPని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని భారత్‌లో కూడా తయారుచేయడం ఆందోళన రేపుతోంది.
Also Read: మధ్యప్రాచ్యంలో ట్రంప్ బిగ్ ట్విస్ట్.. సిరియా నుండి అమెరికా సేనల ఉపసంహరణ!
నిందితులు తమ ఇళ్లు, లాబొరేటరీలోనే పేలుడు పరికరాలు తయారుచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఇలాంటి పేలుడు పదార్థాలను గర్తించడం కష్టంగా మారుతోందని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇవి చాలా ప్రమాదకరమైనవని పేర్కొంది. దాడి సమయంలోనే కాకుండా వీటిని తయారుచేసేటప్పుడు కూడా పేలుడు జరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది. గతంలో కశ్మీర్‌లోని ఉగ్రనెట్‌వర్క్‌లో పేలుడు పదార్థాలను రహస్యంగా తెప్పించుకునేవని.. ఇప్పుడు మాత్రం పేలుడు పదార్థాలను సొంతంగా తయారుచేసుకుంటున్నాయని దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Follow Us