/rtv/media/media_files/2024/11/28/KKkyZkjudoq6sEaaFgO6.jpg)
ఐటీలో పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారిపోతాయో తేలిదు. ఒక్కోసారి ఫ్రేషర్స్‌ను ఎక్కువగా హైర్ చేసుకుంటారు, మరోసారి ఉన్నవారిని తీసేస్తారు. అయితే వచ్చే ఆరు నెలల్లో మాత్రం ఐటీ ఉద్యోగంలో చేరాలనుకునేవారికి మంచి రోజులే అని చెప్పొచ్చు. ఈ రంగంలో 10 నుంచి 12 శాతం నియామకాలు పెరగనున్నాయి. అలాగే జనరేటివ్ ఏఐ, డీప్‌టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షలకు పైగా ఉద్యోగాల నియామకం జరగనుంది. క్వెస్ కార్ప్ అనే బిజినెస్ సర్వీసుల సంస్థ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండు క్వార్టర్స్‌లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఐటీ జాబ్స్‌కు ఉన్న డిమాండ్, మార్కెట్‌లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించేవిధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC), సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమండ్ ఎక్కువగా పెరిగిపోయింది.
Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్
సీక్వెన్షియల్ ప్రాతిపదికన గత త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్ సెక్యూరిటీలో 58 శాతం మేరు ఉద్యోగాలు పెరిగాయి. టెక్ నిపుణులు ఎక్కువగా ఉండటం, డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉన్న నేపథ్యంలో దేశీయంగా రానున్న 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో ఉద్యోగవకాశాలు 10 నుంచి 12 శాతం పెరగొచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ CEO కపిల్ జోషి పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం చూసుకుంటే రెండో త్రైమాసికానికి ఉద్యోగవకాశాల్లో ఈఆర్‌పీ, టెస్టింగ్, నెట్‌వర్కింగ్, డెవలప్‌మెంట్, డేటా సైన్స్ వంటి ఐదు నైపుణ్యాలకు 79 శాతం డిమాండ్ ఉంది. అలాగే జావా 30 శాతం, సైబర్ సెక్యూరిటీ 20 శాతం, డెవ్‌ఆప్స్ 25 శాతం
నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్‌పీ, టెస్టింగ్, నెట్‌వర్కింగ్, డెవలప్‌మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్‌ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.
Also read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు
క్యూ2లో టెక్ హైరింగ్‌కు సంబంధించి జీసీసీలు ముందు వరుసలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్‌ఆప్స్ నిపుణులకు డిమాండ్ ఉంది. ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఉద్యోగ అవకాశాల్లో బెంగళూరు 62 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ 43.5 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
Also Read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు
Also Read: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్!