/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mary-jpg.webp)
Mary kom
భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ త్వరలోనే ఆమె దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నులుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విడాకుల గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే వారిని దూరమయ్యేలా చేసిందంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
బాక్సర్ మేరీ కోమ్ 2005 సంవత్సరంలో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ముగ్గురు అబ్బాయిలు కాగా ఒకరు అమ్మాయి. అయితే ఇంతకాలం హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలైనట్లు సమాచారం. ముఖ్యంగా వీరిద్దరూ త్వరలోనే విడిపోబోతున్నారని, అధికారికంగా ఈ విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.
నలుగురు పిల్లలతో మేరీకోమ్ విడిగా..
ప్రస్తుతం మేరీకోమ్ తన భర్తతో కలిసి ఉండట్లేదని.. ఇటీవలే తన నలుగురు పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌లోని పుట్టింటికి వెళ్లిపోయిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆమె భర్త అకా ఓన్లర్ మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలే అని అంతా భావిస్తున్నారు. అసలు వీరికి, ఆ ఎన్నికలు సంబంధం ఏంటా అనే అనుమానం వస్తోందా.. ఉందండి.. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త అకా ఓన్లర్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం కోం 2 నుంచి 3 కోట్ల రూపాయలకు వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఓడిపోవడంతో.. మేరీకోమ్ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. అవి తట్టుకోలేకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అకా ఓన్లర్‌కు ముందు నుంచే ఇష్టం లేదని.. కానీ మేరీకోమ్‌యే బలవంత పెట్టి ఆయనతో పోటీ చేయించిందని తెలుస్తోంది. ఆమే బలవంతం పెట్టి రంగంలోకి దింపి.. ఓడిపోయిన తర్వాత భర్తతో గొడవ పడిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మేరీకోమ్ కోసం ఆయన భర్త ఎంతో చేశారని.. ఆయన ఫుట్‌బాల్ కెరియర్‌ను కూడా పిల్లల బాగోగుల కోసం వదులుకున్నట్లు రాసుకొస్తున్నాయి.
మరోవైపు మేరీకోమ్‌కు మరో మహిళా బాక్సర్ భర్తతో స్నేహం ఉందని.. దాని వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి.ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియకపోయినప్పటికీ.. వీరి విడాకులు మాత్రం ఖాయం అంటున్నారు.
today-latest-news-in-telugu | boxer | mary-kom