/rtv/media/media_files/2025/01/24/LnkkEDQtz5VvGSgMfGK7.jpg)
Begging Prohibited In Indore, Madhya Pradesh
జనవరి 1 నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బిచ్చమెత్తడం, వేయడాన్ని నిషేధించారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్లందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. దేశంలోని ప్రధాన నగరాలను యాచక రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజికన్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇండోర్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే మితా ణగరాల్లో ఇదిఅమలు చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. ఇండోర్్లో మాత్ర చాలా స్ట్రిక్ట్గా దీన్ని పాటిస్తున్నారు. అక్కడ బిచ్చగాళ్ళ సమాచారం ఇస్తే వెయ్యి రూపాయల నజరానా కూడా ప్రకటించారు. ఇప్పటికి చాలా మందిదాన్ని అందుకున్నారు కూడా.
పాపం అడ్డంగా బుక్కయ్యాడు...
అయితే ఈ రూల్ తెలుసో లేక తెలియకనో ఇండోర్ లో ఓ వ్యక్తి ఒక బిచ్చగత్తెకు దానం చేశాడు. దీనిని గమనించిన కొందరు ఈ విషయాన్ని భిక్షాటన నిరోధక బృందం అధికారికి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన బిచ్చమేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 223 కింద గురువారం కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే బిచ్చం ఇచ్చిన దాతకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా 5వేల రూ. జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.