/rtv/media/media_files/2025/09/25/indigo-2025-09-25-10-00-57.jpg)
విమాన ప్రయాణికులకు ఇండిగో సంస్థ బిగ్ షాకిచ్చింది. పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 14 (శనివారం) నుండి విమాన టికెట్లపై ఫ్యూయల్ ఛార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్ధరాత్రి నుండి బుక్ చేసుకునే అన్ని కొత్త టికెట్లపై వర్తిస్తాయి.యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఏకంగా 85% పైగా పెరగడం విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. టికెట్లపై అదనంగా రూ. 425 నుండి రూ. 2,300 వరకు 'ఫ్యూయల్ ఛార్జ్' వేయాలని ఇండిగో నిర్ణయించింది.
IndiGo, India's leading airline, is introducing a fuel charge on domestic and international routes, effective 00:01hrs on 14th March, 2026. This measure is taken due to the significant surge in fuel prices following the ongoing geopolitical issues in the Middle East. IATA’s Jet… pic.twitter.com/dQ772DWyMW
— Press Trust of India (@PTI_News) March 13, 2026
ముఖ్యంగా మన దేశంలో తిరిగే విమానాలకు, భారత ఉపఖండంలోని ప్రయాణాలకు టికెట్ ధరపై రూ. 425 అదనంగా భారం పడనుంది. ఇక దుబాయ్, మస్కట్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే వారు రూ. 900 ఎక్కువు చెల్లించాలి. చైనా, సౌత్ ఈస్ట్ ఆసియా, ఆఫ్రికా దేశాలకు వెళ్లే ఫ్లైట్లపై రూ. 1,800 యూరప్ వెళ్లే సుదూర ప్రయాణాలపై ఏకంగా రూ. 2,300 అదనపు ఛార్జీలు వడ్డించారు.
40 శాతం కేవలం ఇంధనం కోసమే
నిజానికి విమాన సంస్థల నిర్వహణ ఖర్చులో దాదాపు 40 శాతం కేవలం ఇంధనం కోసమే ఖర్చవుతుంది. ఇప్పుడు యుద్ధం వల్ల ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో విమాన సంస్థలు గత్యంతరం లేక ఈ భారాన్ని ప్రయాణికులపై వేస్తున్నాయి. ప్రయాణికులపై మరీ ఎక్కువ భారం పడకుండా ఉండటానికే ప్రస్తుతం తక్కువ మొత్తంలో ఈ ఛార్జీలను నిర్ణయించామని ఇండిగో సంస్థ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో కంటే ముందే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు కూడా మార్చి 12 నుండే తమ టికెట్ ధరలపై ఇంధన సర్ఛార్జీని పెంచాయి.
Follow Us