Watch Video: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతీకూల వాతావరణం వల్ల చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఆ ఫ్లైట్‌ తిరిగి గాల్లోకి ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

New Update
FLIGHTT

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుపాను ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరీలో కూడా వరదలు పోటెత్తాయి. చెన్నై విమానశ్రయంలో కూడా ఇప్పటికే నీరు చేరింది. దీనివల్ల విమానాలు రన్‌వేలపై దిగేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.  వర్షాల ప్రభావం వల్ల కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌నే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చెన్నై విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు సమస్యలు తలెత్తాయి. ఆ ఫ్లైట్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. 

Also Read: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్‌ విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయింది. దీంతో అది మళ్లీ గాల్లోకి ఎగిరి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Also Read: చెక్ పవర్ రద్దు.. కలెక్టర్లకు ఆ అధికారం కట్.. పంచాయతీ రాజ్ చట్టంలో రానున్న మార్పులివే!

ఇదిలాఉండగా బంగాళఖాతంలో ఏర్పట్ట ఫెంగల్ తుపాను శనివారం సాయంత్రం నాటికి తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంట గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైరు పుదచ్చేరీలో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో అక్కడ పర్యాటక ప్రదేశాలు మూసివేసారు. అయితే వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాక ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. 

Also Read: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment