దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం..

దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
BUSS

దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. ఈ డిపోకు సఖి డిపో అనే పేరు కూడా పెట్టారు. డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ కూడా మహిళలే. ఇందుకోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి తెలిపారు.  

Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. రాహుల్ గాంధీ బ్యాగ్ చెక్ చేసిన అధికారులు

కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది

ప్రస్తుతం చాలామంది మహిళలు బస్ కండక్టర్లుగా, అలాగే ఇతర సిబ్బందిగా కూడా సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇకనుంచి డ్రైవర్లుగై కూడా తమ ప్రతిభను చాటుకుంటారని చెప్పారు. దేశంలోనే ఇది కొత్త ట్రెంట్‌ను సెట్‌ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. దేశంలో తొలిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభించడం మంచిదే అయినప్పటికీ కూడా.. ప్రస్తుతం రవాణా రంగంలో పనిచేస్తున్న తమకు సరైన సౌకర్యాలు లేవని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులు మంత్రి ఎదుట నిరసన చేశారు.   

Also Read: మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత

తమకు ఫిక్స్‌డ్ జీతం, పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని రవాణాశాఖ మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్యూటీకి హాజరుకావాలంటే ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరినా కూడా కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. ఒక్కోసారి సమయానికి పని ప్రదేశానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఈ అంశంపై మహిళా ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి కైలాశ్ గహ్లోత్ వారి డిమాండ్లను నెరవేరుస్తామని అన్నారు. అలాగే మెరుగైన సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.   

Advertisment
Advertisment
తాజా కథనాలు