వారికి గుడ్‌న్యూస్‌.. ఆ శాఖలో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జాబ్ చేసుకునే ఛాన్స్!

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రైల్వేశాఖ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Job

భారత రైల్వే శాఖలో ప్రస్తుతం సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రూల్ ప్రకారం.. సూపర్‌వైజర్ల నుంచి ట్రాక్‌మెన్‌ వరకు ఉన్న వివిధ ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!

వీళ్లకు మాత్రమే ఛాన్స్

అయితే 65 ఏళ్ల లోపు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే ఈ అర్హత ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాల వ్యవధికి వీళ్లని నియమించుకోనున్నారు. పదవీ కాలం పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రైల్వేశాఖ అన్ని జోనల్ రైల్వే మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి. రిటైర్డ్ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్‌నెస్‌తో పాటుగా పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో వాళ్ల పనితీరు ఎలా ఉండేది అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు చేపట్టనున్నారు. 

Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. 

ఆ బెనిఫిట్స్ ఉండవు

గతంలో విజిలెన్స్ గానీ డిపార్ట్‌మెంట్ నుంచి చర్యలు ఎదుర్కొన్న రైల్వే రిటైర్డ్‌ దరఖాస్తుదారులకు అర్హత ఉండదని తేల్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగులు సెలక్ట్ అయితే చివరిసారిగా వారు తీసుకున్న నెలవారీ జీతంలో నుంచి బేసిక్‌ పింఛన్‌ను తొలగించి వేతనం చెల్లిస్తారు. అలాగే ట్రావెల్ అలెవెన్స్‌లు, అధికారిక టూర్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ ఇంక్రిమెంట్ల వంటి బెనిఫిట్స్ వీళ్లకి ఉండవని తెలుస్తోంది. అయితే రైల్వే శాఖలో ప్రస్తుతం సిబ్బంది కొరత నెలకొంది. 

Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

సరిపడా సిబ్బంది లేకపోవడంతో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్క వాయువ్య రైల్వే జోన్‌లోనే ఏకంగా 10 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా జోన్లలో కూడా పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉంటుందని రైల్వేశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh: భార్యకు దగ్గరుండి ప్రియుడికిచ్చి రెండో పెళ్లి చేసిన భర్త!

ఉత్తరప్రదేశ్ లో  భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొకటి జరిగింది. రాహుల్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవితో వివాహం జరిగింది.

New Update
marriage lover

marriage lover

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో కట్టుకున్న భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొక ఘటన జరిగింది.  రాహుల్ సింగ్ (25)అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవి(23)తో వివాహం జరిగింది. అయితే అప్పటికే   వైష్ణవి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీంతో భర్తతో రెండేళ్ల పాటు వైష్ణవి దూరంగా ఉంది. రాహుల్ ఆమెను తిరిగి రావాలని చాలాసార్లు ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ ఆమె నిరాకరిస్తూనే వచ్చింది. దీంతో తన భార్యకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. వారి ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా  ఒప్పుకోగా, భర్తే తన భార్యకు దగ్గరుండి రెండో వివాహం జరిపించాడు.  ఒక న్యాయవాది సహాయంతో స్థానిక తహసీల్ కార్యాలయంలో వైష్ణవి, మనోజ్‌ల పెళ్లిని జరిపించాడు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు.  కతర్ జోట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు - ఆర్యన్ (7), శివాని (2) జన్మించారు.  పనిపనుల కారణంగా బబ్లూ తరచుగా బయట ప్రదేశాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో రాధికకు స్థానిక యువకుడైన వికాస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది.  ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత బబ్లూకు ఈ  విషయం తెలిసింది.  ఆ తర్వాత బబ్లూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. తాను ఎలాగూ తన భార్యకు సమయం కేటాయించలేకపోతున్నానని.. తన భార్య ఇష్టపడిన వ్యక్తితోనే ఇచ్చి రెండో పెళ్లి చేశాడు.  

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment