UAE పై ఇరాన్ దాడులు.. భారతీయుడు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌.. UAE రాజధాని అబుదాబీలో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు భారతీయుడు కూడా ఉండటం కలకలం రేపుతోంది.

New Update
Indian among 2 killed by falling missile debris in Abu Dhabi

Indian among 2 killed by falling missile debris in Abu Dhabi

అందుపశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌.. UAE రాజధాని అబుదాబీలో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. లో ఒకరు భారతీయుడు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఇరాన్‌ నుంచి వచ్చే మిస్సైల్స్‌ను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థమంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్షిపణి శిథిలాలు మీద పడటంతో వీళ్లిద్దరూ చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లలో మరొకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Also Read: అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రధాని మోదీ మీటింగ్ .. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా ?

ఈ క్షిపణి దాడిలో మరో ముగ్గురు గాయపడ్డట్లు యూఏఈ మీడియా తెలిపింది. వీళ్లలో కూడా ఒకరు భారతీయుడు ఉన్నట్లు తెలిపింది. ఇక మరో ఇద్దరిలో ఒకరు UAE, మరొకరు జోర్డాన్‌ చెందిన వాళ్లని చెప్పింది. అయితే ఈ దాడులకు సంబంధించి ఎలాంటి రూమర్స్‌ను ప్రజలు నమ్మొద్దని.. అధికారుల నుంచి వెరిఫై చేసుకోవాలని సూచించింది. ఇదిలాఉండగా UAEపై ఇరాన్ దాడులు చేయడాన్ని జోర్డాన్ ఖండించింది. ఇలా దాడులు చేయడం ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: హర్మూజ్ జలసంధిపై పట్టు కోల్పోయిన ఇరాన్.. నావీ చీఫ్ మృతి

Advertisment
తాజా కథనాలు