అరేబియా సముద్రంలో భారత్-పాక్ 'వార్'.. రంగంలోకి INS ధ్రువ్

క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ ఏప్రిల్ 14-15 తేదీల్లో అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సుమారు 415 నుండి 450 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్షలకి 'నోటమ్' జారీ చేసింది. ఇండియాలో INS ద్రువ్‌ను రంగంలోకి దింపింది.

New Update
INS DRUV

మన పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఉసిగొల్పడమే కాకుండా, ఇప్పుడు సముద్ర గర్భంలోనూ ఉద్రిక్తతలకు తెరలేపింది. గతేడాది పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినగా, తాజాగా పాక్ చేపట్టిన క్షిపణి పరీక్షలు అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

పాక్ 'నోటమ్' కు భారత్ చెక్!

వ్యూహాత్మక క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ ఏప్రిల్ 14-15 తేదీల్లో అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని తన అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కరాచీ, ఓర్మారా, గ్వదర్, సోన్మియాని తీరాలకు సమీపంలో సుమారు 415 నుండి 450 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్షల కోసం కేటాయిస్తూ 'నోటమ్' జారీ చేసింది. అయితే పాక్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ క్షిపణి పరీక్ష ప్రారంభించడానికి 24 గంటల ముందే భారత్ తన 'బ్రహ్మాస్త్రాన్ని' రంగంలోకి దింపింది.

సముద్ర వేగు 'ఐఎన్ఎస్ ధ్రువ్' ఎంట్రీ

పాకిస్థాన్ షాక్ అయ్యేలా భారత్ తన అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక నిఘా యుద్ధనౌక INS ధ్రువ్ ను అరేబియా సముద్రంలోకి పంపింది. భారత్ తీసుకున్న ఈ మెరుపు నిర్ణయంతో పాక్ రక్షణ శాఖ ఉలిక్కిపడింది. ఈ యుద్ధనౌక కేవలం ఓ నౌక మాత్రమే కాదు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక రాడార్ వ్యవస్థల సమాహారం.

ఐఎన్ఎస్ ధ్రువ్ ప్రత్యేకతలు ఇవే..
క్షిపణుల వేటగాడు: శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్స్‌ను ఇది క్షణాల్లో గుర్తించి ట్రాక్ చేయగలదు.
సుదూర నిఘా: వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణుల వేగం, అవి ప్రయాణించే దిశ, వాటి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయగల సామర్థ్యం దీని సొంతం.
సముద్ర గస్తీ: అరేబియా సముద్రంలో భారత్ ప్రయోజనాలకు భంగం కలగకుండా నిరంతరం నిఘా ఉంచుతుంది.
టెక్నాలజీ: ఇది నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానమై ఉంటుంది, దీనివల్ల శత్రువుల ప్రతి కదలికను రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు.

ఉత్కంఠ రేపుతున్న పరిస్థితులు

పాకిస్థాన్ క్షిపణి ప్రయోగాలు జరిపి భారత్‌ను భయపెట్టాలని చూస్తే, భారత్ తన రక్షణ కవచాన్ని ముందే మోహరించి తిరుగులేని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాక్ చేసే ప్రతి కదలికను ఐఎన్ఎస్ ధ్రువ్ పర్యవేక్షిస్తుండటంతో, వారి మిసైల్ టెక్నాలజీ రహస్యాలు ఎక్కడ బయటపడతాయోనని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు