Income Tax Act 2025: నేటి నుంచి అమల్లోకి కొత్త చట్టం.. మారిన 10 రూల్స్ ఇవే!

దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి నుండి అమల్లోకి వచ్చింది.

New Update
tax year

Income Tax Act 2025

Income Tax Act 2025: దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం 2025' నేటి (ఏప్రిల్ 1, 2026) నుండి అమల్లోకి వచ్చింది. పన్ను విధానాన్ని సరళీకరించడం, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం వల్ల సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిపై ప్రభావం పడనుంది.

ఈ కొత్త చట్టం ప్రకారం మారిన టాప్-10 అంశాలు 

1. పన్ను సంవత్సరం 
ఇకపై 'ఆర్థిక సంవత్సరం' (FY), 'మదింపు సంవత్సరం' (AY) అనే గందరగోళం ఉండదు. ఈ రెండింటి స్థానంలో కేవలం ‘ట్యాక్స్ ఈయర్’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టారు.

Also Read: ఫ్యాన్స్ కు షాకిచ్చిన పూనమ్ పాండే! ప్రెగ్నెన్సీనా..? లేక ఏప్రిల్ ఫూల్ స్టంటా..?

2. ITR గడువు పెంపు
వ్యాపారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తూ ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. సాధారణ ఐటీఆర్-1, 2లకు జూలై 31 గడువు యథాతథంగా ఉంటుంది.

3. పిల్లల చదువులకు భారీ మినహాయింపు
మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరట. గతంలో బిడ్డకు నెలకు రూ.100 ఉన్న విద్యా భత్యాన్ని ఏకంగా రూ.3,000కు పెంచారు. అలాగే హాస్టల్ అలవెన్స్‌ను రూ.300 నుండి రూ.9,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

4. HRA నిబంధనల్లో మార్పులు
ఇకపై అద్దె మినహాయింపు పొందాలంటే యజమాని పాన్ వివరాలు, రసీదులు తప్పనిసరి. మరో విశేషమేమిటంటే.. హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలను కూడా 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు జాబితాలో చేర్చారు.

Also Read: 'ఏప్రీల్ 1'న చూసిందల్లా నమ్మేయకండి..! ఫూల్స్ డే చరిత్ర ఇదే! ఇంతకీ 'ఏప్రిల్'ను కరెక్టుగానే చదివారా?

5. మీల్ కార్డులు & గిఫ్ట్ వోచర్లు
ఉద్యోగులకు ఇచ్చే మీల్ కార్డుల పన్ను రహిత పరిమితిని రూ.50 నుండి రూ.200కు పెంచారు. అలాగే గిఫ్ట్ వోచర్ల పరిమితిని రూ.5,000 నుండి రూ.15,000కు పెంచారు.

6. F&O ట్రేడింగ్‌పై భారం
స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు షాక్ ఇస్తూ ఫ్యూచర్స్ అండ్‌ ఆప్షన్స్ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ని పెంచారు. దీనివల్ల ట్రేడింగ్ వ్యయం పెరగనుంది.

7. షేర్ బైబ్యాక్‌లు
ఇకపై కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేస్తే, ఆ లాభాలను డివిడెండ్‌గా కాకుండా మూలధన లాభాలుగా పరిగణించి పన్ను విధిస్తారు.

Also Read: ఒకే సినిమాగా 'ధురంధర్' పార్ట్ 1 & 2.. ఇంటెర్వెల్స్, రన్ టైమ్ వివరాలివే! రిలీజ్ ఎప్పుడంటే..?

8. PAN రూల్స్ కఠినం
పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి. కేవలం ఆధార్ ఉంటే సరిపోదని, అదనపు పత్రాలు కూడా అవసరమని స్పష్టం చేశారు.

9. కొత్త ఫారాలు
పాత ఫారాల పేర్లు మారాయి. ఫారం 16 ఇకపై ఫారం 130గా, ఫారం 16A ఇకపై ఫారం 131గా చలామణి అవుతాయి.

10. డిజిటల్ పారదర్శకత
మొత్తం ప్రక్రియను డిజిటల్ మయం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు గందరగోళం తగ్గించి, పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చినందున, పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికలను తదనుగుణంగా మార్చుకోవడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు