/rtv/media/media_files/2025/03/09/c37uNxXe2FjXKvVMCnhU.jpg)
Actoress Ranya Rao
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్ పోర్ట్లో దొరికిపోయింది నటి రన్యారావు. మార్చి అర్ధరాత్రి 2వ తేదీన ఆమెను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. దాని తరువాత ఆమె గురించి ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్యారావు, తరుణ్ ల అక్రమ వ్యాపారం కూడా బయటపడింది. ప్రస్తుతం ఈమె బెంగళూరు జైల్లో ఉంది. ఈక్రమంలో రన్యారావు భర్త జతిన్ ను కూడా డీఆర్ఐ అధికారులు విచారించారు. అయితే ఇందులో అతని ప్రమేయం ఏమీ లేదని తేలింది. దీంతో అతను కేసు నుంచి బయటపడ్డారు.
కానీ నాకు విడాకులు..
2004లో అక్టోబర్ లో ఒక రెస్టారెంట్ లో రన్యారావు, జతిన్ మొదటి సారి కలిశారు. అదే 23న వారిద్దరి నిశ్చితార్థం జరిగింది. తర్వాత రేసు కోర్సు రోడ్డులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో 2024 నవంబర్ 27న రన్యారావు, జతిన్ వివాహం జరిగింది. ల్యావెల్లి రోడ్డులోని ఒక ఖరీదైన ఫ్లాట్ లో ఇద్దరూ కలిసి ఉండడం మొదలుపెట్టారు. అయితే నెలరోజులకే ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. చాలా సార్లు తాను వద్దన్నా పని ఉందని, వ్యాపారం చూసుకోవాలని ప్రతీసారి రన్యారావు దుబాయ్ కు వెళ్ళి వచ్చేదని జతిన్ చెబుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వినలేదు అని అన్నారు. వద్దన్నా వినకుండా విదేశీ ప్రయాణాలు చేయడంతో ఆమెతో అప్పటి నుంచే దూరంగా ఉంటూ వస్తున్నానని జతిన్ చెప్పారు. ఇప్పుడు రన్యారావు అరెస్ట్ అయింది. ఒకవేళ ఇందులో నుంచి ఆమె బయటకు వచ్చినా కలిసి ఉండడం సాధ్యం కాదని చెబుతున్నారు. అందుకే తనన నుంచి విడాకులు ఇప్పించాలని అర్జీ పెట్టాలని అనుకుంటున్నానని జతిన్ తెలిపారు. ప్రముఖ న్యాయవాది ప్రభులింగ నావడగి సాయంతో విడాకులకు అర్జీని సిద్ధం చేసుకున్నారు.
today-latest-news-in-telugu | bengaluru | heroine Ranya Rao | husband
Also Read: HYD: పథకం ప్రకారమే జర్మన్ యువతిపై అత్యాచారం..దర్యాప్తు కీలక విషయాలు