Sabarimala: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వివరించారు. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు.

New Update
sabarimala

Sabarimala: శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వివరించారు. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. 

Also Read: AP: ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు

మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో స్వాములు తరలి వస్తుండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ నిర్వహిస్తుంది.

Also Read: IRCTC: పుణ్య క్షేత్రాలకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ట్రైన్‌!

కాగా, ఇప్పటికే శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగానే ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవడంతో దర్శనం కల్పిస్తుంది. అయినా భక్తుల తాకిడి తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందనే అంచనాతో అనేక నిర్ణయాలు ట్రావెన్ కోర్ దేవస్థానం తీసుకుంటుంది.

ప్రత్యేకంగా 26 రైళ్లు..

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుకలు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. అయ్యప్ప మాల వేసిన భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ప్రయాణికులకు మరింత సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. 

Also Read: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

ఇదిలా ఉండగా.. కేరళ ప్రభుత్వం ఇటీవల స్వామి అనే చాట్‌బాట్‌ను కూడా విడుదల చేసింది.శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వామి పేరుతో కొత్త చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వామి చాట్‌బాట్‌ లోగోను ఆవిష్కరించారు.ఈ చాట్‌బాట్‌ను ముత్తూట్ గ్రూప్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించింది. శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో మీకు కావాల్సిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్‌బాట్‌ను ప్రభుత్వం రూపొందించింది.

Also Read: TG Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి బిగ్ షాక్!

శబరిమలలో పూజా సమయం, దర్శన సమయాలు ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు విమానాలు, రైళ్లు, స్థానిక వివరాలు, పోలీసులు, అటవీ శాఖ వివరాలు కూడా ఈ స్వామి చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. యాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment