ప్రస్తుతం చైనాలో హెచ్‌ఎంపీవీ (HMPV) కలకలం రేపుతున్న వేళ భారత్‌లోకి కూడా ఈ వైరస్ వచ్చేసింది. మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగా.. గుజరాత్‌లో ఓ కేసు గుర్తించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3 నెలల పాప, అలాగే 8 నెలల చిన్నారికి, అహ్మదాబాద్‌లో రెండు నెలల చిన్నారికి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టం చేసింది. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఈ హెచ్‌ఎంపీవీ వ్యాప్తిలో ఉందని.. కేసులు కూడా నమోదయ్యాయని చెప్పింది. Also Read: దారుణం.. 10 మంది జవాన్లు మృతి అయితే బెంగళూరులో వైరస్ సోకిన మూడు నెలల చిన్నారి కోలుకుంది. ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి చేశారు. మరో 9 నెలల చిన్నారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అలాగే అహ్మదాబాద్‌లో వైరస్ సోకిన చిన్నారి కూడా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వైరస్ వచ్చిన చిన్నారి కుటుంబాలు ఎలాంటి ప్రయాణాలు కూడా చేయలేదు. ఇదిలాఉండగా చైనాలో ఈ హెచ్‌ఎంపీవీ కేసులతో పాటు శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమ్తమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) నేతృత్వంలో జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) భేటీ నిర్వహించింది. వాతావరణ మార్పుల వల్లే చలికాలంలో వస్తున్న మార్పుల వల్లే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ లాంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తెలిపింది. భారత్‌లో ఈ వైరస్‌పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల పరీక్షల చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. శ్వాసకోశ వ్యాధులు పెరిగినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారినపడే అవకాశాలు ఎక్కువ. Also Read: ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి HMPV లక్షణాలు హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన, తుమ్మిన, శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ HMPV వైరస్ కొత్తదేమి కాదు.. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్‌ను వైద్యులు గుర్తించారు. కానీ ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చైనా, జపాన్‌లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా ఈ కేసులు పెరిగితే లాక్‌డౌన్ పడే ఛాన్స్ ఉంటుందని కొందరు అంటున్నారు.