Big breaking : జంతర్‌ మంతర్‌ వద్ద  హై టెన్షన్....ఢిల్లీలో అడుగుపెట్టిన CJP అధ్యక్షుడు  అభిజీత్ దీప్కే

నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) తో పాటు CUET, SSC GD తదితర పోటీ పరీక్షల లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగ యువత తరఫున గళమెత్తుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో రాజధాని నగరంలో హైటెన్షన్ నెలకొంది.

New Update
FotoJet - 2026-06-06T101037.802

Cockroach Janta Party

 Big breaking :  దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) తో పాటు CUET, SSC GD వంటి వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, అవకతవకల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ పరీక్షల లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగ యువత తరఫున గళమెత్తుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఢిల్లీలోని ప్రసిద్ధ నిరసన వేదిక జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో రాజధాని నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బలంగా డిమాండ్ చేస్తోంది. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలను ఎండగడుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వేదికగా ఈ భారీ నిరసన ప్రదర్శనకు పార్టీ సన్నద్ధమైంది.

ఈ భారీ ఆందోళన కార్యక్రమాన్ని ముందుండి నడిపించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అమెరికా నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ఉద్యమించి, ఈ ప్రత్యేక పార్టీని స్థాపించిన ఆయన, విదేశాల నుండి స్వదేశానికి రావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అభిజీత్ దీప్కే ఢిల్లీలో అడుగుపెట్టడంతో ఈ నిరసన ప్రదర్శన మరింత ఉధృతం కానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఈ ఆందోళన కార్యక్రమంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. జంతర్ మంతర్ వద్ద ఈ సభ గనుక జరిగితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు సీజేపీ ప్రతిపాదిత ధర్నాకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకారులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ పూర్తి నిఘా నీడలోకి తీసుకువచ్చారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అభిజీత్ దీప్కే అడుగుపెట్టిన తరుణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన నిరసన స్థలానికి చేరుకుంటే పరిస్థితి చేజారిపోతుందన్న అనుమానంతో, విమానాశ్రయం (ఎయిర్‌పోర్టు) లోనే అభిజీత్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. మరోవైపు ఢిల్లీలోని ప్రధాన కూడళ్లు, నిరసన వేదికల వద్ద పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లను ఏర్పాటు చేశారు.

కేవలం నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల చుట్టూ సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పరీక్షల లీకేజీల అంశం దేశంలోని ప్రతి కుటుంబానికి సంబంధించినది కావడంతో, ఈ పార్టీ చేపట్టిన నిరసనకు పలువురు దేశీయ రాజకీయ ప్రముఖులు, విపక్ష నాయకులు కూడా తమ మద్దతును ప్రకటించడం గమనార్హం. దిల్లీ పోలీసుల ఆంక్షల నడుమ ఈ ఆందోళన ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Advertisment
తాజా కథనాలు