/rtv/media/media_files/2025/02/18/50CXPXOV1qXjqJ8r2eV3.jpg)
Health Ministry to launch nationwide screening drive for high BP, diabetes, cancer
Health Ministry: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. అధిక రక్తపోటు (High BP), డయాబెటీస్, క్యాన్సర్(Diabetes, Cancer) వంటి వ్యాధులపై దేశవ్యాప్తంగా ఉచితంగా పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు వీటిపై స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించనున్నామని పేర్కొంది. 30 ఏళ్లు దాటిన వారు తమ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో ఇలాంటి వ్యాధులపై ఉచితంగానే టెస్టులు చేయించుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా దీనిపై పోస్టు చేసింది.
Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్
అన్ని టెస్టులు ఫ్రీ..
దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు, డయాబెటీస్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి వాటిపై పరీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు డయాబెటీస్ లక్షణాలను కూడా కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. కళ్లు స్పష్టంగా కనిపించకపోవడం, ఆకలి పెరగడం, గాయాలు ఆలస్యంగా మానడం, అలసట, దాహం ఎక్కువగా వేయడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, ఎక్కువగా మూత్రానికి వెళ్తుండటం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
#NCDScreeningDrive | 3 DAYS TO GO
— Ministry of Health (@MoHFW_INDIA) February 17, 2025
Don't ignore these symptoms of diabetes!
Take charge of your health—join the nationwide Screening Drive for Non-Communicable Diseases (NCDs) from 20th February to 31st March, 2025, and get screened for free at your nearest Government… pic.twitter.com/GjfZAM72IH
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
ప్రస్తుతం దేశంలో ఇలాంటి బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ డ్రైవ్ చేపడ్డటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో 66 శాతం మరణాలు ఇలాంటి వ్యాధుల వల్లే సంభవించాయని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ICMR-NIN) వెల్లడించింది. హృదయ సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ కేసులు ప్రజారోగ్యానికి సవాలుగా మారాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు ఇలాంటి వాటికి ఎక్కువగా గురవుతున్నారు.
Also Read: అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది!