మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Ajp

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ సమయంలో మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగీ ఓ నినాదం ఇచ్చారు. ప్రజలను ఉద్దేశిస్తూ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అని అన్నారు. ఈ నినాదాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. పవార్ తీరుపై మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్థం చేసుకోవాలని సూచించారు. దీంతో అధికార మహాయుతీ కూటమిలో ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్నాయి.  

Also Read: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్!

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో బీజేపీ స్టార్‌ ప్రచారకర్తగా యోగీ ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇటీవల ఓ ర్యాలీలో ప్రజలనుద్దేశిస్తూ మాట్లాడుతూ.. విడిపోతే పడిపోతాం అనే అర్థం ఇచ్చేలా నినాదం చేశారు. గతంలో కూడా ఈయన పలుసార్లు ఈ నినాదాన్ని వాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై సొంత నేతల నుంచే వ్యతిరేకత వస్తోంది.  

యోగీ వ్యాఖ్యలపై అజిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ నినాదాన్ని నేను సమర్థించను. ఇప్పటికే చాలాసార్లు దీని గురించి చెప్పాను. ఈ నినాదం ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పనిచేస్తుందేమో కానీ.. అంబేద్కర్ సూత్రాలు పాటించే మహారాష్ట్ర నేలపై దీనికి స్థానం లేదని అన్నారు. మరోవైపు బీజేపీ నేత పంకజ ముండే కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించారు. 

Also Read: మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా

అయితే తాజాగా అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. '' అజిత్ పవార్ కొన్ని దశాబ్దాల పాటుగా హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతో పనిచేశారు. అందుకే ఇంకా ఆయనపై మాజీ మిత్రుల (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజల నాడిని అర్థం చేసుకునేందుకు ఆయనకు ఇంకా కొంత సమయం పడుతుందని'' ఫడ్నవీస్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇలా అధికార మహాయుతీ కుటమిలో విభేదాలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. 23న ఝార్ఖండ్‌తో పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Heatwave Warning

Heatwave Warning


Heatwave Warning : ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ర్టాల్లోనూ ఈ రోజు  ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!


మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

ఇక ఏపీలోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది.శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

Advertisment
Advertisment
Advertisment