/rtv/media/media_files/2025/03/29/085GI9gw50SmWWAJtScN.jpg)
Betting Apps
Madhavi Latha: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 25 మంది సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పై ఇటీవలే పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న వారంతా ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిని నమ్మి బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెట్టి.. కోల్పోయిన ఎంతో మంది బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీ కి చెందిన దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా.. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్స్ తో పాటూ పలువురు యూట్యూబర్లపై కూడా కేసు నమోదయింది. అందులో నాని అనే యూట్యూబర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇప్పుడు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ , భయ్యా సన్నీ యాదవ్ ల కోసం గాలింపు చేపట్టారు. ఏ క్షణమైనా వీరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మరో యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మండిపడుతూ వారిని వ్యక్తిగతంగా దూషిస్తున్న వేళ ప్రముఖ హీరోయిన్ మాధవి లత కౌంటర్ అటాక్ స్టా్ర్ట్ చేసింది. ఆ వీడియోలతో యూట్యూబర్ అన్వేష్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక వీడియోని కూడా వదిలిన ఈమె అన్వేష్ పై మండిపడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ కామెంట్లు చేసింది.
Also Read : KYC Deadline: రేషన్ కార్డులదారులకు గుడ్ న్యూస్..ఆ గడువు పొడిగింపు
ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై మండిపడుతున్న యూట్యూబర్ అన్వేష్ పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవి లత.. ఈమె మాట్లాడుతూ..” ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో.. అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి వస్తే పాపలతో తిరగవచ్చు. మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయొచ్చు.. అని చెబుతున్నారు. ఇతని మాటలు ఏం నేర్పుతున్నాయి.ఇది ఏమాత్రం కరెక్టు.. ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్ను అమ్మనా బూతులు తిడతారు. అయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను నిజాన్ని నిర్భయంగా చెబుతాను. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే.. ఓహో ఫారిన్ కంట్రీస్ కి వెళ్తే మనం కూడా పాపలతో తిరుగొచ్చు కదా.. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు అంత అర్జెంటుగా మనకి డబ్బులు ఎవరిస్తారు. మన దగ్గర కూడా డబ్బు ఉంటే మనం కూడా అలా కంట్రీస్ వెళ్లి పాపతో తిరగవచ్చు. కాబట్టి మనకు ఈజీగా డబ్బు కావాలి. దీంతో ఇంకో ఛానల్ ఓపెన్ చేసి.. బెట్టింగ్ యాప్ లో గేమ్ ఆడితే.. ఈజీగా మనీ వస్తుంది మామా అని అంటాడు. మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బ్రతికేయొచ్చు. వేరే ప్రాంతాలకు వెళ్లొచ్చు. వేరే కంట్రీస్ పాపలతో తిరగవచ్చు అని ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెడతాడు. తద్వారా ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగిపోతాయి అంటూ అన్వేష్ పై మండిపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది మాధవి లత. ఇక ప్రస్తుతం మాధవి లత చేసిన కామెంట్లకు చాలామంది ఏకీభవిస్తున్నారు. దీంతో అన్వేష్ పై కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి.
Also Read : ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!