హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌‌కు మెసేజ్‌ పెట్టి యువతి ఆత్మహత్య

గుజరాత్‌లో ఓ యువతి మరణం కలకలం రేపింది. నేను చనిపోతున్నా...నువ్వు పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అంటూ లవర్‌‌కు ఒక మెసేజ్ వదిలేసి మరీ వెళ్ళిపోయింది. అయితే ఇది పెళ్ళి చేసుకున్న భర్త గురించి కాక మరో వ్యక్తికి అవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

New Update
gj

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్ పూర్‌‌లో రాధ ఠాకూర్ అనే 27ఏళ్ళయువతి ఆత్మహత్య చేసుకుంది.  ఈమె అక్కడే ఒక బ్యూటీ పార్లర్ నడుపుతోంది. రాధకు పెళ్ళయింది కానీ భర్తతో విడిపోయి సోదరితో కలిసి జీవిస్తోంది. ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన రాధ..సోదరితో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. మర్నాడు ఉదయం ఎంత లేపినా లేవలేదు. చివరకు ఆమె చనిపోయింది తెలిసింది. దీంతో రాధ ఫోన్ చెక్ చేశారు. అందులో ఆడియో మెసేజ్‌లను గుర్తించారు. ఆమె.. వేరే వ్యక్తితో ఫోన్‌లో సంభాషించినట్లు గా గుర్తించారు. వెంటనే రాధ సోదరి అల్కా పోలీసులను ఆశ్రయించింది. గుర్తుతెలియని వ్యక్తిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

Also Read: పబ్జీలో పరిచయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!

చనిపోయే ముందు ఆడియో మెసేజ్..

రాధ ఫోన్లో మరిన్ని విషయాలను పోలీసులు గమనించారు. ఆమె.. ఆ వ్యక్తిని ఫొటో అడగడం కూడా వినిపించింది. అయితే అతడు ఆ ఫొటో పంపించలేదు. అయితే గంటలోగా ఫొటో రాకపోతే ఏమవుతుందో చూడు అంటూ రాధ హెచ్చరించినట్లుగా ఆడియోలో వినిపించింది. దీని తరువాత వెంటనే అతనికి మళ్ళీ సారీ చెప్పింది. నన్ను క్షమించు.. మిమ్మల్ని అడగకుండానే తప్పు చేస్తున్నాను. బాధపడకండి.. సంతోషంగా ఉండండి. జీవితాన్ని ఆస్వాదించండి. వివాహం చేసుకోండి. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయానని అనుకోవద్దు. చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. మీరు సంతోషంగా ఉంటే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. పని మరియు జీవితంపై కలత చెందాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని రాధ మాట్లాడింది. ప్రస్తుతం రాధ మరణ ఒక మిస్టరీగా మారింది. ఆమె ఎవరికి మెసేజ్‌లు పంపింది...ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Also Read: రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఫైన్..సీరియస్ అయిన రెరా

Also Read: కన్న తల్లినే.. ఛీ.. ఛీ.. ఈ కిరాతక కొడుకు ఏం చేశాడంటే!

Also Read: సినీ నటిని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు.

New Update
V BREAKING

వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు అత్యున్నత న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు. కేసు విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ చట్టాల అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. ముస్లీం కమ్యూనిటీ అధికారాలను లాక్కునేందుకు కుట్ర జరుగుతుందని కపిల్ సిబల్ కోర్టులో పేర్కొన్నారు. వక్ఫ్ నూతన చట్టాలు మతస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

Also read: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా..? అయితే ఇలా చేయండి

హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుందా, హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని సీజేఐ ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు భూముల్లోనే ఉందని సీజేఐ అన్నారు. చారిత్రాత్మక ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించలేమన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. 2వారాల్లో కేంద్రం వక్ఫ్ చట్టంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు పంపింది. కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధికారం కల్పించడంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

 

 

 

Advertisment
Advertisment
Advertisment