Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ

శివరాత్రి ముందు గుజరాత్ లోని ద్వారకా ఆలయంలో శివలింగం చోరీకి గురైంది.  ఈ సంచలనం సృష్టించిన దొంతనం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా, తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. 

New Update
gj

dwaraka siva lingam

మహా శివరాత్రి పండక్కి ఒక్కరోజు ముందు దారుణం జరిగింది. ఓ ఆలయంలో రాతి శివలింగం చోరీ అయింది. ఈ ఘటన గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఆలయ తలుపులు తెరిచి ఉన్నాయని..  లోపలికి వెళ్లి చూసేసరికి శివలింగం లేదని ఆలయ పూజారి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పురాతన శివాలయంలోని శివలింగాన్ని పునాదితో సహా పెకిలించి దొంగిలించారని ఆలయ పూజారి ఫిర్యాదులో వెల్లడించారు.

కల వచ్చింది అందుకే చేశాం..

ఈ దొంగతనం కేసు గుజరాత్ లో సంచలనంగా మారింది. దాంతో అక్కడి పోలీసులు, అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపరీతంగా సోధించి మొత్తానికి దొంగలను పట్టుకున్నారు. అయితే దొంగలు దొరికాక...వారు చెప్పిన విషయాలు పోలీసులను మరింత విస్మయానికి గురిచేశాయి. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా.. తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. ఈ కేసులో కుటుంబంలోని 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కుటుంబంలో ఒక అమ్మాయికి ఒక కల వచ్చిందట. దానిని అనుసరిస్తూనే ఫ్యామిలీ వారు శివలింగాన్ని చోరీ చేశారు. మహేంద్ర మక్వానా అనే వ్యక్తి మేనకోడలుకు  భీద్బంజన్ మహాదేవ్ ఆలయంలోని శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించడం వల్ల వారి సమస్యలు తొలిగిపోయి, మంచి జరుగుతుందని కల వచ్చింది. దీన్ని ఆ కుటుంబం మొత్తం నమ్మింది. అంతే ఇంకుముంది కట్టకట్టుకుని గుడికి వెళ్ళి శివలింగాన్ని పెకిలించి తీసుకుని వచ్చేశారు. దొంగతనానికి ముందు ద్వారకాలో కుటుంబం మొత్తం వారం రోజులు ఉంది. తరువాత దాన్ని ఇంటికి తీసుకువచ్చి మహాశివరాత్రి నాడు దానిని ఇంట్లో ప్రతిష్టించుకున్నారు. 

ఈ కేసులో మహేంద్రతో పాటు కుటుంబంలోని ముగ్గురు మహిళలతో పాటు వనరాజ్, మనోజ్, జగత్ అనే మరో ముగ్గురిని కూడా ద్వారకా పోలీసులు అరెస్ట్ చేశారు.   దొంగిలించిన శివలింగాన్ని స్వాధీనం చేసుకుని, ద్వారకలోని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు.

Also Read: USA: డాలర్ ఆధిపత్యం తగ్గనుందా?  పెద్దన్నపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment