/rtv/media/media_files/2025/02/06/gQsy61K0dMcVvuKJfrz3.webp)
Gold and silver prices
Gold Price : భారతీయులకు నగలు అంటే వ్యామోహం ఎక్కువ. బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇలా ఎవైనా అందంగా అలంకరించుకోవడం అలవాటు. అయితే రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండిధరలు నగలు కొనాలనుకుంటున్నావారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 85 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది. తాజాగా 86 వేలు దాటేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86, 250కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 79, 060కి చేరింది. కేవలం నెల రోజుల వ్యవధిలో బంగారం ధర ఏకంగా 8 వేలు పెరిగింది. పెరిగిన ధర అంతటితో ఆగుతుందా? ఇంకా పెరుగుతుందా తెలియదు. ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది. తెలుగురాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ దారులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: AP Cabinet : వారందరికీ గుడ్ న్యూస్ .. ఏపీ కేబినెట్ వరాల జల్లు!
10 గ్రాముల బంగారం ధర లక్ష దాటే అవకాశం
అమెరికాలో ట్రంప్ గెలుపు ప్రభావం భారతీయ మార్కెట్ పై స్పష్టంగా కనపడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక యూఎస్ డాలర్ బలం పుంజుకుంది. విదేశీ పెట్టుబడి దారులు ఇండియాలో పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. ఈ ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్లపై పడింది. ఇదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో పెరుగుదల రేటుంటే ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటే అవకాశం లేకపోలేది మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఇదిలా ఉండగా నేనేమీ తక్కువ కాదన్నట్లు వెండి కూడా బంగారం దారిలోనే నడుస్తోంది.ప్రస్తుతం వెండి ధర కూడా లక్షకు చేరుకుంటుంది.
Also Read : TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
అమెరికా విధానాల ప్రభావం భారతీయ మార్కెట్ పై స్పష్టంగా పడే అవకాశం ఉంది ముఖ్యంగా డాలర్ ధర మరింత పుంజుకుంటే ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుకునే అవకాశం ఉంది. దీని కారణంగా బండారం ధర నిరంతరం పెరిగే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవ్వడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: LIC: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?