/rtv/media/media_files/2025/01/21/TUZJpcpSuEO4W0krRSbO.jpg)
Hindu marriage Photograph: (Hindu marriage )
ప్రియుడి కోసం ప్రియురాలు మతం మార్చుకోవడం మనం చూసి ఉంటాం కానీ ఇక్కడ రివర్స్ గా జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ముస్లిం నుంచి హిందూమతంలోకి మారాడు. అంతేకాకుండా తన పేరును కూడా మార్చుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. నగర్ బజార్‌కు చెందిన సద్దాం హుస్సేన్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ (సుమారు 30 ఏళ్లు)తో సుమారు పదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.
అయితే ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి పలుమార్లు అబ్బాయిపై ఒత్తిడి తెచ్చింది. కానీ సద్దాం కుటుంబం ఆమెను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. దీంతో ఆ ఆమ్మాయి మూడు రోజుల క్రితం బస్తీ పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. సద్దాం హుస్సేన్ తనపై అత్యాచారం చేశాడని, బలవంతంగా అబార్షన్ చేయించి చంపేస్తానని బెదిరించాడంటూ ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశం మేరకు పోలీసులు సద్దాం, అతని కుటుంబ సభ్యులపై నగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.
దీంతో సద్దాం తన మతాన్ని, కుటుంబ సభ్యులను పక్కన పెట్టి ప్రియురాలి కోసం ముందడుగు వేశాడు. ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి మారి సద్దాం నుండి శివశంకర్ మార్చుకున్నాడు. ఆదివారం రాత్రి సిటీ మార్కెట్‌లోని ఒక హిందూ ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకుందని కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దేవేంద్ర సింగ్ తెలిపారు. ఇద్దరూ దేవాలయంలో ఏడు ఆడుగులు వేసి మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఈ నిర్ణయం తమ ఇష్టపూర్వకంగా తీసుకున్నామని పోలీసులకు వెల్లడించారు. తమకు రక్షణగా ఉండాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది.