/rtv/media/media_files/2024/12/21/9A3VNrVkStWkpJfMri5S.jpg)
up crime Photograph
Up Crime: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మీరట్‌లో కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను హతమార్చి మృతదేహాలను గోనె సంచిలో దాచి పెట్టారు. ఈ హృదయ విదారక ఘటనల్లో మృతుల్లో భర్త, భార్య, ముగ్గురు బాలికలు ఉన్నారు. లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ కాలనీలో జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు.
దారుణంగా హత్య:
మృతుల్లో మోయిన్, భార్య అస్మా, కుమార్తెలు అఫ్సా (8), అజీజా (4), అదీబా (1)గా పోలీసులు గుర్తించారు. అయితే.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దోపిడి కోసం వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రం మొయిన్ సోదరుడు సలీం ఇంటికి చేరుకోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారిని అడిగిన తర్వాత బలవంతంగా తలుపులు పగలగొట్టారు. ఇంటి లోపల మోయిన్, అస్మా మృతదేహాలు నేలపై పడి ఉండగా.. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను బెడ్ రూమ్‌లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: చదివింది గుర్తుండటం లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో టాపర్ మీరే
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఎస్పీ విపిన్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైం బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు. యూపీలో ఇలాంటి దారుణ హత్యలు పెరిగిపోవడం వలన ప్రజలు ఆందోళనకు గురైతున్నారు.ఈ హత్యను వీలైనంత త్వరగా ఛేదించేందుకు పోలీసులు నిఘా పెంచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఈ పొరపాటు వల్ల అమ్మాయిల జుట్టు ఊడుతుంది