రూ.79,450 కోట్లు బూడిదపాలు.. రేపు ఓపెనింగ్, ఈరోజు కాలిపోయిన రిఫైనరీ ఫ్యాక్టరీ

రాజస్థాన్‌లోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధానమంత్రి మోదీ ఈ అత్యాధునిక రిఫైనరీని ప్రారంభించడానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
_refinery Unit

అసలే పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్‌తో చమురు కొరత ఏర్పడింది. దీంతో కేంద్రం ముడి చమురు కోసం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఈక్రమంలో భారత్ రిఫైనరీ రంగానికి బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రిఫైనరీని ప్రారంభించడానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (CDU) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న కార్మికులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. 20 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే పనిలో పడ్డాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. ఈ ప్యాక్టరీ రేపే (మంగళవారం) ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన నష్టం అంచనా వేస్తున్నారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన సాయంత్రం 4 గంటలకు రిఫైనరీని సందర్శించనున్నారు. టెక్నికల్ టీంల రిపోర్ట్ తర్వాత ప్రమాదానికి గల కారణాలు, నష్టంపై పూర్తి స్పష్టత రానుంది.

ప్రాజెక్టు విశేషాలు:
భారతదేశపు మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు రూ. 79,450 కోట్లు పెట్టుబడితో నిర్మించారు. హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. 17.0 నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్‌తో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఈ ఫ్యాక్టరీలో ఉన్నాయి.

భారతదేశ ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషించనున్న ఈ ప్రాజెక్ట్, వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పెట్రోకెమికల్ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముందే జరిగిన ఈ ప్రమాదం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు